Vijay-Rashmika : కలిసే దీపావళి పండుగ త్వరలో పెళ్ళి..ఇదుగో ప్రూఫ్..?

Vijay-Rashmika : విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ర‌ష్మిక వీరిద్దరూ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీలనే చెప్పాలి. ఈ జంటకు సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా నెట్టింట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎక్కడ ఈ ఇద్దరు కలిసి కనిపించినా ఏదో ఒక ట్యాగ్ లైన్ తో వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు రాసేస్తున్నారు. అప్పటల్ో ఈ జంట సీక్రెట్ వెకేష‌న్స్ గురించి చాలా రకాల వార్తలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేశాయి. ఇంత జరుగుతున్నా, ఇప్పటివరకు ఈ ఇద్ద‌రూ తామ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. మేమిద్దరం మంచి స్నేహితులం అని మాత్ర‌మే చెప్పుకుంటూ వస్తున్నారు.

vijay-rashmika-diwali-celebrations-photos-going-viral

అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీపావళి సందర్భంగా నిన్న రాత్రి ర‌ష్మిక మందన్న తన ఫ్యాన్స్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ దీపాల పండుగ రోజున సంతోషకర క్ష‌ణాల‌కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొంచెం గ్యాప్ తీసుకుని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా త‌న‌ ఫ్యామిలీతో కలిసి దీపావళి జరుపుకున్న ఫోటోలను రిలీజ్ చేశాడు. అయితే నెటిజన్స్ ఊరుకుంటారా రష్మిక, విజయ్ ఫోటోలను పోల్చడం మొదలు పెట్టారు. అసలే వీరిద్దరూ మోస్ట్ వాంటెడ్ కపుల్, ఇంకేముందు చాలా మంది నెటిజన్లు ఇద్దరు పోస్ట్ చేసిన ఫోటోల‌ మధ్య తేడాలని గమనించారు. దీనిని బట్టి వీరిద్దరూ కలిసే దీపావ‌ళి పండుగ చేసుకున్నారని కామెంట్లను పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. కానీ వీరిద్దరూ జాగ్రత్తపడ్డారో ఏమో కానీ క‌లిసి ఉన్న ఫోటోల‌ను మాత్రం పోస్ట్ చేయ‌లేదు. ఈ ఫోటోలు చూస్తుంటే విజయ్, రష్మిక జంట‌గా దీపావళి వేడుకను కలిసి చేసుకున్నారని ఫిక్స్ అవుతున్నారు. దీంతో మరోసారి వీరి అనుబంధంపై ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు నెట్టింట్లో వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ జోడీ దాని గురించి ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇదిగో ప్రూఫ్‌.. గీత‌-గోవిందం దీపావ‌ళి పార్టీ అంటూ వీరి అభిమానులు ఈ ఫోటోల‌ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

vijay-rashmika-diwali-celebrations-photos-going-viral

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ప‌ర‌శురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ టీం ఫారెన్ లో కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఇక ర‌ష్మిక మంద‌న్న ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది. బాలీవుడ్ లో గుడ్‌బై, మిషన్ మజ్ను సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్‌తో సందడి చేయబోతోంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ చూడాలని అందరూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే రణబీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా టీజర్ లాంచ్ చేశారు. త్వ‌ర‌లో యానిమ‌ల్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ కానుంది. అలాగే పుష్ప 2లోనూ రష్మిక శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా రికార్డుల్లో ఉంది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

3 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

4 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.