Sai Pallavi: స్పీడ్ పెంచింది..రామ్ చరణ్, నాగ చైతన్య సినిమాలకి గ్రీన్ సిగ్నల్..!

Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవి స్పీడ్ పెంచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగ చైతన్య సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ కొత్త సినిమాలను ఒప్పుకోలేదు. దీనికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. సాయి పల్లవికి నచ్చిన కథ రాలేదు. అదీ కాక ఈ మధ్య అందరూ శ్రీలీల వెనకాల పడ్డారు.

శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న పాన్ ఇండియన్ సినిమాలో సాయి పల్లవిని ఎంచుకున్నారనే సమాచారం ఉంది. కానీ, అధికారికమైన ప్రకటన ఇంకా రాలేదు. ఇక తమిళంలో సాయి పల్లవి ఇప్పటికే రెండు సినిమాలకి సైన్ చేసిందట. త్వరలో అవి సెట్స్ మీదకి రానున్నాయని కోలీవుడ్ మీడియా సంచారం.

sai-pallavi-Green signal for Ram Charan and Naga Chaitanya movies..!

Sai Pallavi: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా

ఇక తెలుగులో చందు మొండేటి దర్శకుడిగా అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో కూడా సాయి పల్లవి ఒకే అయింది. ఇప్పటికే, వీరి కాంబోలో లవ్ స్టోరీ సినిమా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదే క్రమంలో రామ్ చరణ్ సరసన కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాను చేయాల్సి ఉంది. శంకర్ సినిమా ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాలేదు. ఇదే సినిమా కోసం చరణ్ సరసన సాయి పల్లవిని అడిగారట. ఈ మూవీ చేయడానికి సాయి పల్లవి ఒప్పుకుందని, త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని టాలీవుడ్ మీడియా సమాచారం. ఇంతకముందు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఫిదా చిత్రం చేసి ఇక్కడ సెటిలైన సంగతి తెలిసిందే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.