Categories: EntertainmentLatest

Vijay Antony : జీవితంలో చెప్పులు వేసుకోను

Vijay Antony : తమిళ స్టార్ హీరో, దర్శకుడు విజయ్‌ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగునాట ఫేమస్ అయ్యాడు. ఈ ఒక్క సినిమాతో విజయ్ ఆంటోనీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి తమిళంలో మనోడి సినిమాలు మంచి హిట్ టాక్ తో ఆడుతున్నాయి. రీసెంట్ గా బిచ్చగాడు2 కూడా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఇప్పుడు విజయ్ తుఫాన్ సినిమాతో మారోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ లో త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో మన హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. గత మూడు నెలలుగా తాను చెప్పులు లేకుండానే తిరుగుతున్నానని చెప్పుకొచ్చాడు. ఫ్యూచర్ లో కూడా చెప్పులు వేసుకోకూడదని డిసైడ్ అయ్యానని తెలిపాడు. అయితే చెప్పులు వేసుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదని తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

vijay-antony-in-future-also-i-will-not-wear-chappals

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంలో తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఆయన కెరీర్ లో వచ్చిన బిచ్చగాడు, రోషగాడు, రాఘవన్, సైతాన్, లవ్ గురు వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తుఫాన్ సినిమాతో మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నాడు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‏టైనర్ జానర్‌లో ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు విజయ్ మిల్టన్. జూన్ లో ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఈ క్రమంలో లేటెస్టుగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

vijay-antony-in-future-also-i-will-not-wear-chappals

ఇక విజయ్ ఆంటోని తుఫాన్‌ టీజర్‌ రిలీజ్ కార్యక్రమానికి చెప్పులు లేకుండా రావడంతో అందరి దృష్టి వాటిపైనే పడ్డాయి. దాంతో మీరు ఏదైనా దీక్షలో ఉన్నారా? అని మీడియా హీరోని అడిగింది. దీంతో ఆంటోనీ అసలు విషయం చెప్పుకొచ్చాడు. ” నేను ఎలాంటి దీక్ష చేయడం లేదు. గత 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఒకరోజు నేను చెప్పులు లేకుండా నడిచాను. అది నాకు బాగా నచ్చింది. ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిదనిపించింది. అంతేకాదు నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి అనిపించలేదు. అందుకే జీవితాంతం చెప్పులు వేసుకోకూడదని అనుకుంటున్నా” అని విజయ్‌ అంటోని చెప్పారు.

vijay-antony-in-future-also-i-will-not-wear-chappals

ఇక తుపాన్ టీజర్ అద్భుతంగా ఉంది. ఒక నిమిషం 23 సెకండ్లు ఉన్న ఈ టీజర్ నిడివి గల ఈ టీజర్‌ ఆధ్యంతం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. కొన్ని జీవితాలు తక్కువనే ఆలోచన ప్రపంచంలోని తప్పులన్నింటికీ మూలం అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఈ మూవీ. ప్రస్తుతం తుఫాన్ షూటింగ్ చివరి దశలో ఉంది. మూవీ షూటింగ్‌ను ఎక్కువగా అండమాన్, డయ్యూ డమన్‌లలో జరిపారు.ఈ మూవీలో విజయ్ ఆంటోనీకి జోడీగా మేఘా ఆకాష్ నటిస్తోంది. సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్, కన్నడ హీరో డాలి ధనంజయ, సీనియర్ నటులు సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.