Categories: EntertainmentLatest

Gayathri Guptha : బేబీ డైరెక్టర్ చీట్ చేశాడు

Gayathri Guptha : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా చేసిన మూవీ బేబి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ సాయి రాజేశ్ కు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. కానీ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ మాత్రం బేబి డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. బేబీ సినిమా స్టోరీ తనదని తన ఐడియాను సాయి కాపీ కొట్టాడని శిరిన్ ఆరోపించాడు. ఈ వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ప్రూఫ్స్ తో సహా బేబి లీక్స్ అనే ఓ బుక్ కూడా రిలీజ్ చేశాడు. ఇక ఇదే అంశంపై నటి గాయత్రి గుప్తా రియాక్ట్ అయ్యింది. ఫిదా సినిమాతో ఫేమసైన గాయత్రి ఆ తర్వాత ఐస్ క్రీమ్ 2, కొబ్బరి మట్ట, మిఠాయి వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. అయితే బేబి స్టోరీని శిరిన్ ప్రేమించొద్దు అనే పేరుతో రాసుకున్నాడని, ప్రూఫ్స్ తో సహా గాయత్రి బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

gayathri-guptha-controversy-comments-on-baby-movie-director

గాయత్రి మాట్లాడుతూ..” ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ ఓ కథను రాసుకున్నాడు. ఆ కథనే కాపీ కొట్టి బేబీ సినిమా తీశాడు రాజేశ్. ప్రేమించొద్దు సినిమాకు ముందుగా నన్ను హీరోయిన్‏గా అనుకున్నాడు. అందుకు లుక్ టెస్ట్ కూడా చేశాడు. ఓ స్కూల్ డ్రెస్ తీసుకువచ్చి ఫోటోషూట్ కూడా చేశాడు. ఆ ఫోటోలను సాయి రాజేశ్ కు చూపించాను. ఆ ఫోటోను బేస్ చేసుకుని బేబి సినిమా తీశాడు. ఆ విషయం నాకు తెలియదు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. నాకు సాయి రాజేశ్ తో ఇబ్బందులు రావడం కొత్తేమి కాదు. సాయి తీసిన కొబ్బరి మట్ట సినిమాలో నేను చేశాను. అప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.

gayathri-guptha-controversy-comments-on-baby-movie-director

కొబ్బరి మట్ట సినిమాకు నా రెమ్యునరేషన్ రూ.3 లక్షలు అని చెప్పాడు. కానీ కేవలం రూ.25 వేలు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత సినిమా మధ్యలోనే నేను అతని టార్చర్ తట్టుకోలేక మాయమయ్యాను. బేబి స్టోరీ ముందుగా రాసుకుంది శిరిన్. కానీ సాయి రాజేశ్ మాత్రం తానే క్రియేట్ చేశానని చెప్పుకున్నాడు. తమిళనాడులో ఎక్కడో రియల్ గా జరిగిందని చెబుతున్నాడు. ముందుగా శిరిన్, సాయి ఇద్దరూ కలిసి ఆ స్టోరీతో సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో సాయి చీట్ చేశాడు. బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్ ను తప్పించాడు. గీతా ఆర్ట్స్ చాలా మంచిది. కానీ పాములాంటి సాయి రాజేశ్ ను వారు గుర్తించాలి. బేబి సినిమా కోసం సాయి ఎన్నో చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు. బేబి క్యారెక్టర్ ను దారుణంగా చూపించాడు. హీరోయిన్ పై నెగిటివిటీ తీసుకొచ్చాడు. ఆమె పోస్టర్ ను కొందరు చెప్పులతో కూడా కొట్టారు. అంతగా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. టాలీవుడ్ కి సాయి రాజేశ్ ఒక మచ్చ. శిరిన్ శ్రీరామ్ కు న్యాయం జరగాలి”అని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది గాయత్రి.

Sri Aruna Sri

Recent Posts

Bhaumvati Amavasya 2026: నేడే బౌమా అమావాస్య.. పితృ,కుజ దోష నివారణకు అనుకూలం!

Bhaumvati Amavasya 2026: ప్రతినెల మనకు అమావాస్య వస్తుంది అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను బౌమతి అమావాస్య లేదా…

41 seconds ago

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

21 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

24 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

3 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

5 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

5 days ago

This website uses cookies.