Pushpa 2 : ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సుకుమార్ ప్రమోషన్లతో ఫ్యాన్స్ ను పరేషాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా పుష్ప2 నుంచి ఓ గ్లింప్స్, ఓ సాంగ్ ఒదిలా అభిమానుల్లో, సినీ ప్రియుల్లో అంచనాలను భారీగా పెంచేశాడు. అల్లు అర్జున్ సాంగ్ పుష్ప పుష్ప సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఫ్యాన్స్ పూనకాలతో ఓ రేంజ్ లో ఊగిపోయారు. ఇక ఈ పాట స్టెప్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ సింగల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే కపుల్ సాంగ్ విడుదలైంది. లిరిక్స్‌కు స్టైలిష్ కాస్ట్యూమ్‌లో అల్లు అర్జున్ తో కలిసి శ్రీవల్లి స్టెప్పులేసి అదరగొట్టింది. ఈ పాటతో రష్మిక తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చినట్లైంది.ఈ కపుల్ సాంగ్ రిలీజైన కాసేపట్లోనే ట్రేండింగ్ లో నిలిచింది.
తెలంగాణ ఫేమస్ రైటర్,ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ సూసేకి అగ్గిరవ్వే పాటకు లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటను బాలీవుడ్ టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడింది. ‘తగ్గేదేలే’ అనే మేనరిజంతో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ లో సింపుల్ స్టేప్స్తో బన్ని, రష్మిక ఈ పాటకు డ్యాన్స్ ఇరగదీశారు. ఫస్ట్ షార్ట్ లో రష్మికను డీగ్లామర్‌గా చూపించినా ఈపాటలో స్టైలిష్‌లుక్‌లో కనిపించింది. పాట్ రిలీజైన గంటలోపే 5 లక్ష్యల వ్యూస్ దాటి రేసు గుర్రంలా దూసుకెళ్తోంది.
పుష్ప సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించి రికార్డ్ క్రియేట్ చేసిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాదే పుష్ప2కు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పుష్పలో ఉన్నట్లే ఈ మూవీలోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ తృప్రి దిమ్రి ని దింపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ, దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఈ మూవీ కచ్చితంగా రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని టాక్.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.