Venu Swamy : వేణు స్వామి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. సినీస్టార్స్, పొలిటికల్ లీడర్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో బాగాఫేమస్ అయ్యాడు. స్టార్ హీరోయిన్లు సమంత,రష్మిక, పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది ట్రెండింగ్ స్టార్ల గురించి కామెంట్లు చేస్తూ నెట్టింట్లో హైలెట్ అవుతున్నాడు. ఈయన చెప్పిన జాతకాల్లో కొందరివి నిజం అయితే..మరికొంతమంది విషయంలో వర్కౌట్ కాలేదు. అయినా కైడా వేణు స్వామి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఎంతమంది నెటిజన్స్ ఆయన్ని ట్రోల్ చేసినా అవేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. రీసెంట్ గా సినిమా డైలాగులతో రీల్స్ కూడా చేస్తూ తన క్రేజ్ తగ్గకుండా జాగ్రత్తపడుతున్నాడు.
ఇదిలా ఉంటే వేణు స్వామి తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాడు. ఆ నటి డివోర్స్ గురించి సెన్సేషనల్ విషయాలను బయట పెట్టాడు. దీంతో ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు కలర్స్ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయమైన నటి కలర్స్ స్వాతి. ఆ ప్రోగ్రామ్ తో పాపులారిటీ సంపాదించుకున్న స్వాతి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నిజానికి స్వాతి తెలుగులో చేసింది చాలా కొద్ది సినిమాలే అయినా ఆమెకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.స్వాతి నటించిన దాదాపు అన్ని సినిమాలు థియేటర్ వద్ద హిట్ అయ్యాయి. మంచి ఫామ్ లో ఉండగానే లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది.అయితే ఛానాళ్ల తర్వాత స్వాతి మళ్లీ తెరముందు కనిపిస్తోంది. పెళ్లి తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే స్వాతి తన భర్తతో డివోర్స్ తీసుకుందని రూమర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వాటిపై స్వాతి ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఈ క్రమంలో వేణు స్వామి స్వాతి డివోర్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.
తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ..” స్వాతి ఓ రోజు నా దగ్గరికి వచ్చింది. తన జాతకం చూయించుకుంది. తనకి మ్యారేజ్ లైఫ్ బాగోదని, డివోర్స్ తీసుకుంటావని చెప్పాను. అయితే స్వాతికి ఈ విషయం నచ్చలేదు. నా పై కోపడి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఆమె జీవితంలో అదే జరిగింది. నేను చెప్పిన జాతకంలో ఉన్నట్లే ఉంది”అని వేణు స్వామి తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అయ్యింది. నెటిజన్స్ రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు..అదే విధంగ స్వాతి తన డివోర్స్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు అంటున్నారు.