Mon. Nov 17th, 2025

    Veins In Legs: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఎక్కువగా చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది ప్రస్తుత కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది అయితే ఈ సమస్య ఎంతో ప్రమాదకరమని కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయే స్థితికి తీసుకు వస్తుందని తెలుస్తోంది.

     

    veins-in-legs-if-they-are-showing-these-symptoms-then-must-beware
    veins-in-legs-if-they-are-showing-these-symptoms-then-must-beware

    Veins In Legs: అలాగే కాళ్లు తరచూ ఉబ్బుతూ ఉంటాయి.

    అయితే మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకు పోయిందని చెప్పడానికి కొన్ని సంకేతాలు స్పష్టంగా కనపడతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారి కాలంలో మంటలు రావడం నొప్పులు రావడం జరుగుతుంది. ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు చాలా మంది కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం తిరిగి ఇలాంటి నొప్పి వస్తుంది అలాగే కాళ్లు తరచూ ఉబ్బుతూ ఉంటాయి.

    ఇలా కాళ్లు వాపులు రావడం శరీరంలో రక్తనాళాలు బయటకు కనిపించడం వంటి లక్షణాలు మీలో కనుక ఉన్నాయి అంటే మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఇలా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే కనుక మీ శరీరంలో రక్త ప్రసరణ సమస్యలు తలెత్తే అది కూడా కొలెస్ట్రాల్ సమస్యలుగా భావించాలి. అలాగే సిరలల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల గుండెకు, అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు. దీంతో కాళ్లల్లో రంగు మారుతుంది. కండరాల తిమ్మిర్లు, కాళ్లు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కాళ్లల్లో సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది.అందుకే ఈ లక్షణాలు ఉంటే కనుక వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.