Shani Dosham: సాధారణంగా శని ఒకసారి తన ప్రభావాన్ని మనపై చూపిస్తే ఏడు సంవత్సరాల పాటు ఆశని ప్రభావం మనల్ని వెంటాడుతూ ఉంటుందని భావిస్తారు. శని అంటే మనం భయపడాల్సిన పనిలేదు శనీశ్వరుడు కేవలం మనం చేసినటువంటి కర్మలకు తగ్గ ఫలితాన్ని మాత్రమే అందిస్తూ ఉంటారు అందుకే ఎవరూ కూడా ఎలాంటి తప్పులు చేయకూడదని కర్మఫల సిద్ధాంతాన్ని పొందకూడదని భావిస్తూ ఉంటారు. అయితే చాలామంది వారు చేసిన కర్మల వల్ల శని ప్రభావం అనుభవిస్తూ ఉంటారు. మరి ఇలాంటి శని ప్రభావం తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
శని ప్రభావం కారణంగా ఏర్పడినటువంటి దోషం తొలగిపోవాలి అంటే శనివారం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చాలామంది శనివారం ఉపవాస ఉంటారు అయితే ఉపవాసం ఉండటానికి ముందు రోజు ఎలాంటి మద్యం మాంసాహారం పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ఇక శనివారం ఉదయం పొద్దున్నే స్నానం చేసి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి శనీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు చేయాలి.
శనీశ్వరుడిని పూజించిన తర్వాత రావి చెట్టుకు నీరును పోసి రావి చెట్టుకు కూడా పూజలు చేయాలి.ఆ తరువాత వికసించిన చెట్టు చుట్టూ 7 సార్లు దారం చుట్టి పూజ చేయాలి. శనివారం నాడు పుష్పించే చెట్టును పూజించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ఇక శనివారం ఉపవాసంతో శనీశ్వరుడు వ్రత కథ వినడం ఎంతో మంచిది. శనిని ప్రసన్నం చేసుకోవడానికి, శనిదేవుని ఇనుప విగ్రహాన్ని శనివారం పూజించాలి. అలాగే శని దేవుడికి ఇష్టమైన నల్ల నువ్వులు, ఆవనూనె, నల్లని వస్త్రాలు సమర్పించాలి. ఈ రోజు దుప్పటి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.