Vastu Tips: సాధారణంగా మనం ఏదైనా నిర్మాణం చేపడితే తప్పనిసరిగా వాస్తును దృష్టిలో పెట్టుకొని నిర్మాణ పనులను ప్రారంభిస్తూ ఉంటాము వాస్తు లోపాలు కనుక ఉన్నట్లయితే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక వాస్తు లోపాలను దృష్టిలో పెట్టుకొని ఇంటి నిర్మాణ పనులు లేదా ఇంట్లో అలంకరణ వస్తువులను కూడా అలంకరించుకోవడం జరుగుతుంది. ఇక చాలామంది ఇంట్లో నిరంతరం కష్టపడుతూ పనిచేస్తున్న చేతిలో చిల్లిగవ్వ నిలబడదు ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కలబంద మొక్క ఉండటం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కలబంద మొక్కను కనుక ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక అభివృద్ధితో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంతోషాలు కూడా వెల్లువిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కలబంద నాటే విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
కలబంద మొక్కను గనుక ఇంట్లో నాటుతున్నట్లయితే పొరపాటున కూడా వాయువ్య దిశలో నాటకూడదు.
ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుంది. జీవితంలో శ్రేయస్సు ఆనందం కావాలంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటవచ్చు. అంతేకాదు పశ్చిమదిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఈ మొక్కను కనుక ఆగ్నేయ దిశలో నాటడం వల్ల మనం చేసే పనులలో పురోగతి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక ఇంట్లో మానసిక ప్రశాంతత కోరుకునేవారు కలబంద మొక్కను తూర్పు దిశలో నాటడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.