Vastu Tips: సాధారణంగా మనం ఎంతో మంది దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటాము అదేవిధంగా కొన్ని దేవత విగ్రహాలను కూడా ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉంటాము ఇలా విగ్రహాలు పెట్టి పూజించడం వల్ల ఎంతో మంచి కలుగుతుందని భావిస్తుంటారు అయితే కొన్ని రకాల విగ్రహాలను పూజించడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయని అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని పండితులు చెబుతుంటారు అయితే మన ఇంట్లో ఈ విగ్రహాలు కనుక ఉంటే సంపదకు ఏమాత్రం లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
ఉత్తర దిశను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే దేవతలు, దేవుళ్లు ఈ దిశలోనే నివసిస్తారని నమ్ముతారు. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచండి. దీనివల్ల మీరు ధనలాభం పొందుతారు. బాతు దంపతుల విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచడం వల్ల మీ వైవాహిక జీవితం ఆనందంగా, సంతోషంగా సాగుతుంది. ఇక హిందువులు గోమాతను పూజిస్తారు కనుక కామదేనువు విగ్రహం కూడా ఇంట్లో ఉండటం ఎంతో మంచిది.
ఇంట్లో కంచుతో తయారు చేసిన కామధేనువు విగ్రహం ఉండడం మంచిది. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సనాతన ధర్మంలో తాబేలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు. తాబేలును ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాలు ఇంట్లో ఉండటం ఎంతో మంచిది.