Vastu Tips: సాధారణంగా ఒకరు ఉన్నత స్థాయిలో ఉంటే తప్పనిసరిగా అందరూ చూపు వారిపైనే ఉంటుంది అయితే చాలామంది వారు ఎదుగుదల చూసి సంతోషించగా మరికొందరు మాత్రం ఈర్ష పడుతూ ఉంటారు. ఇలా ఈర్ష పడే వారి దృష్టి మన కుటుంబం పై పడినప్పుడు ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఇలా మన ఇంటిపై చెడు దృష్టి ప్రభావం ఉంది అంటే ఒక వ్యక్తి నుంచి సానుకూల శక్తి ఇంట్లో వ్యాప్తి చెంది గొడవలకు పోట్లాటలకు కారణమవుతారు. ఇలా ఇంట్లో జరుగుతుంది అంటే ఇంటిపై చెడు దృష్టి ప్రభావం పడినట్లే.
కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేసుకునే చోట కూడా ఇలాంటి చెడు దృష్టి ప్రభావం కనుక పడింది అంటే వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది ఇలా మీ పై లేదా మీ వ్యాపారం పై చెడు ప్రభావం పడిందనే సందేహం కనుక వస్తే వెంటనే ఈ పరిహారాలను పాటించడం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మీ ఇంటిపై కనుక చెడు దిష్టి ప్రభావం ఉంటే శనివారం రోజు రెండు నిమ్మకాయలు ఏడు పచ్చిమిరపకాయలను దారంతో కూర్చి వాటిని అందరికీ కనపడేలాగా ఇంటి గుమ్మం ముందు లేదా గేటు ముందు లేకపోతే వ్యాపారం చేసే చోటైన వేలాడతీయాలి. ఇలా చేయటం వల్ల చెడు దిష్టి మొత్తం తొలగిపోతుంది. ప్రతి శనివారం వీటిని మారుస్తూ ఉండాలి అలాగే ఒకపటికను నల్లని వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయాలి.ఎండుమిర్చి, ఆవాలు 7 సార్లు వ్యాపార స్థలంలో తిప్పి వాటిని మంటలో వేసి కాల్చండి. ఇలా చేయటం వల్ల చెడు దృష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది.