Thyroid: ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇలా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు బాధపడుతున్నటువంటి సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. సాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ థైరాయిడ్ గ్రంధి ఉంటుంది అయితే ఇది విడుదల కావలసిన శాతం కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలైనప్పుడు హార్మోన్ ఇన్ బాలన్స్ కారణంగా థైరాయిడ్ వ్యాధి వస్తుంది.
థైరాయిడ్ రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది.థైరాయిడ్ హార్మోన్ తక్కువగా పనిచేస్తే హైపోథైరాయిడిజం.అంటారు. అదే ఎక్కువగా పని చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అని అంటారు. ఇక ఈ థైరాయిడ్ వ్యాధి చిన్నపిల్లలలో రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో మొదటిగా చెప్పుకోవాల్సిందే సమతుల్యమైన ఆహారం లేకపోవడమే కారణమని చెప్పాలి. ప్రస్తుత కాలంలో పిల్లలు పోషక విలువల కలిగిన ఆహార పదార్థాల కంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు.
చాలామందిలో హార్మోన్స్ అసమతుల్యత కారణంగా కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రభావం థైరాయిడ్ గ్రంధి పై ఉంటుంది. వీటితో పాటు
మానసిక ఒత్తిడి కూడా థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి కారణాల వల్ల చిన్న పిల్లల్లో కూడా ఈ థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.