Shami Tree: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల మొక్కలను దైవ సమానంగా భావించి వాటిని ఇంటి ఆవరణంలో నాటి పూజిస్తూ ఉంటాము. ఇలా మన ఇంటి ఆవరణంలో అరటి చెట్టు లేదంటే బిల్వపత్రం పారిజాతం తులసి వంటి చెట్లు ఎన్నో ఉంటాయి అయితే ఇంటి ఆవరణంలో జమ్మి చెట్టు పెంచవచ్చా జమ్మి చెట్టును నాటడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తు శాస్త్ర ప్రకారం జమ్మి చెట్టు నాటితే ఏ దిశలో నాటాలి అనే సందేహాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి.
వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇంటి ఆవరణంలో జమ్మి చెట్టు ఉండటం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.శనీశ్వరుడు అనుగ్రహం పొందడానికి జమ్మి చెట్టును క్రమం తప్పకుండా పూజించడం శుభఫలితాలను ఇస్తుంది. అయితే ఇంటి ఆవరణంలో ఈ జమ్మి చెట్టు నాటాలి అనుకునేవారు శనివారం లేదా విజయదశమి వంటి ముఖ్యమైనటువంటి రోజులలో నాటడం ఎంతో మంచిది అలాగే ఈ చెట్టుకు శనివారం లేదా సోమవారం ఎర్రటి కలువ పువ్వులతో పూజ చేయడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున జమ్మి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ద్వారం వద్ద చెట్టు నాటడానికి స్థలం లేకపోతే డాబాపై దక్షిణం వైపు నాటడం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు అయితే ఈ చెట్టు మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల మనకు సానుకూల ఫలితాలు రావడమే కాకుండా శనీశ్వరుడి అనుగ్రహం మనపై ఉండి మనలో ఉన్నటువంటి ఈ జాతక దోషాలన్నింటిని కూడా తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.