Akshaya tritiya: వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నారు. ఈ రోజు శుభ సమయం అని భావిస్తారు కనుక ఈరోజు మనం ఎలాంటి పనులు చేసిన ఎంతో విజయవంతం అవుతాయని పురాణాలలో చెప్పబడింది అందుకే అక్షయ తృతీయ రోజు అన్నీ కూడా మంచి పనులు శుభకార్యాలు చేయాలని చెబుతూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు.
మరి అక్షయ తృతీయ రోజు చేయకూడని ఆ పనులు ఏంటి చేస్తే ఎలాంటి ఫలితాలను అనుభవిస్తారనే విషయానికి వస్తే.. అక్షయ తృతీయ రోజు చాలామంది లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు పూజలు చేసిన అనంతరం వారి ఆర్థిక స్తోమతలకు అనుకూలంగా ఇంట్లోకి ఏదైనా చిన్న బంగారం లేదా వెండి వస్తువులను తీసుకువస్తూ ఉంటారు. అయితే ఇంట్లోకి వస్తువులను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో పొరపాటున మనకు తెలిసి తెలియకుండా కొన్ని వస్తువులను కొంటూ ఉంటాము.
ముఖ్యంగా ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులను కొనడం మానుకోవాలి. ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తాడని పండితులు చెబుతున్నారు. ఇకపోతే అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఎవరికి అప్పుగా డబ్బును ఇవ్వకూడదు. ఇక అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు కనుక లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందే ఉంటుందని భావిస్తారు అందుకే పొరపాటున కూడా సాయంత్రం పూట ఇంట్లో చీపురుతో శుభ్రం చేయకూడదు. సాయంత్రం కంటే ముందుగానే ఇంటిని శుభ్రపరుచుకోవాలి అలాగే ఈరోజు మాంసం మధ్య వాటిని తినకపోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.