Vastu Tips: ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ అని చెప్పాలి. జీవితంలో తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని భావించే ప్రతి ఒక్కరు కూడా వారి స్థోమతకు అనుగుణంగా సొంత ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. ఈ విధంగా సొంత ఇంటిని నిర్మించిన తర్వాత గృహప్రవేశ చేసే సమయంలో తమ సమీప బంధువులందరినీ కూడా పిలిచి ఎంతో ఘనంగా గృహ ప్రవేశ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే గృహప్రవేశం చేసే సమయంలో ఆడంబరాలకు పోయి కొన్ని విషయాలను పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ ఇంట్లోకి చేరేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి అవి పాటించాలని పండితులు చెబుతున్నారు.
ముందుగా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతుందా లేదా అనే విషయాలను గుర్తించి ఇంటిని నిర్మించుకోవాలి ఒకవేళ వాస్తు సరిగా లేకపోతే వాటిని సరి చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడు ఈశాన్య దిశ వైపు ఉండాలి అలా లేని పక్షంలో తూర్పు వైపుకు ఇంటి ప్రధాన ద్వారం ఉండటం ఎంతో శుభం. ఇక గృహప్రవేశానికి ఎప్పుడు పడితే అప్పుడు చేరడం మంచిది కాదు సరైన తేదీ తిథి ముహూర్తం చూసుకొని ఇంట్లోకి ప్రవేశించడం మంచిది.
ఇక ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ముందుగా వినాయకుడి పూజ చేయాలి అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వల్ల మన ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం ఎంతో శుభం. ఇక ఇంట్లోకి చేరిన తర్వాత చాలామంది ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోతూ ఉంటారు. కానీ అలా అసలు చేయకూడదు. ఇంట్లోకి చేరిన తర్వాత మూడు రోజులు తప్పనిసరిగా అదే ఇంట్లోనే నిద్ర చేయాలని పండితులు చెబుతున్నారు. ఇకపోతే మనం కొత్త ఇంట్లోకి చేరడమే కాదు ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.