Technology: సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం నడుస్తుంది. ఈ సోషల్ మీడియాలో పేస్ బుక్, ట్విట్టర్ లాంటి పబ్లిక్ డొమైన్స్ ఆధిపత్యంలో ఉన్నాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా చాలా యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చిన కూడా ట్విట్టర్, పేస్ బుక్ ని మాత్రం ఏ ఒక్కటి బీట్ చేయలేకపోయింది. ముఖ్యంగా ట్విట్టర్ కి అయితే తెరుగే లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు ట్విట్టర్ లోనే ఉన్నారు. ట్విట్టర్ ద్వారానే ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. ట్విట్టర్ లో ఉండే సెక్యూరిటీ ఫీచర్స్ వలన దాని మీద డిపెండ్ అయ్యేవారు పెరిగారు.
అయితే ట్విట్టర్ ని ఎలాన్ మాస్క్ కొనుగోలు చేసిన తర్వాత దానిలో చాలా మార్పులు చేస్తున్నారు. సెక్యూరిటీ ఫీచర్స్ ని పెంచుతున్నారు. అలాగే బ్లూ టిక్ మార్క్ ని పెయిడ్ చేస్తున్నారు. బ్లూ టిక్ మార్క్ ఇకపై ఎవరికైనా కావాలంటే డబ్బులు చెల్లించాలి అనే నిబంధన తీసుకొచ్చారు. దీనిని ఇప్పటికే అప్డేట్ లోకి తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో చాలా మంది యూజర్స్ ట్విట్టర్ ని వీడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్ ని చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కసారిగా ట్విట్టర్ కి ప్రత్యామ్నాయంగా ఉన్న మాస్టోడాన్, కూ యాప్ లకి డిమాండ్ పెరిగింది.
అలాగే ట్విట్టర్ తరహాలోనే మాస్టాడాన్ అనేది ఓపెన్ సోర్స్ మైక్రో బ్లాగింగ్ సైట్. డీసెంట్రలైజ్ పద్దతిలో పని చేసే ఈ సైట్ లో వినియోగదారుల కోసం ప్రత్యేక సర్వర్ లు ఉంటాయి. ఈ సర్వర్స్ లో ఆకా కమ్యునిటీలో డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. యూజర్స్ నచ్చిన కేటగిరీలో చేరవచ్చు. ఇక ఈ కమ్యునిటీలోలో ఎవరికీ ఏది అవసరమో అంత వరకే చూపిస్తుంది. అనవసరమైన డేటాని చూపించదు. అలాగే మీరు వినియోగిస్తున్న సర్వర్ లో ఎంత మంది యూజర్స్ చేరారో కూడా చూసే అవకాశం ఉంటుంది.
ఇక యూజర్స్ మీరు ఎంచుకున్న కమ్యునిటీలో మీ అభిప్రాయాలని షేర్ చేసుకోవచ్చు. ఇక ఈ మాస్టోడాన్ బ్లాగ్ లో ఒక్క వారంలోనే రెండు లక్షల మంది యూజర్స్ సబ్ స్క్రైబ్ అయినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. అయితే వీరంతా ట్విట్టర్ వినియోగదారులే అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకున్నా మాస్టోడాన్ కి వినియోగదారుల సంఖ్య పెరగడానికి ట్విట్టర్ లో జరుగుతున్న మార్పులే కారణం అని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే కూ మైక్రో బ్లాకింగ్ యాప్ కి కూడా యూజర్స్ ఈ మధ్య కాలంలో భాగా పెరిగారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.