Movies: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోలు అందరూ కమర్షియల్ సినిమా మాయలో ఉండేవారు. అలాగే కథలు అన్ని కూడా తమని తాము ఎలివేట్ చేసుకోవడానికి అనే విధంగానే ఉండేవి. ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తెరకెక్కించే వారు. ఈ కారణంగా స్టార్ హీరోల ఖాతాలో హిట్స్ కంటే ఫ్లాప్స్ మాత్రమే ఎక్కువగా ఉండేవి. కమర్షియల్ సక్సెస్ అయినా కూడా నిర్మాతలకి మాత్రం పెద్దగా లాభాలు వచ్చేవి కావు. అయితే గత మూడేళ్ళ కాలంలో తెలుగు సినిమా శైలి పూర్తిగా మారిందని చెప్పాలి. ఎప్పుడైతే పాన్ ఇండియా మార్కెట్ పై తెలుగు హీరోలు దృష్టిపెట్టారో అప్పటి నుంచి కథల ఎంపిక విధానం కూడా పూర్తిగా మారింది.
ఇండియన్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కథలని ఎంపిక చేసుకుంటున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత తెలుగు దర్శకులు, హీరోలు అందరి పంథా కూడా మారింది. ఎమోషనల్ ఎలిమెంట్స్ బలంగా ఉన్న కథలకి పచ్చజెండా ఊపుతున్నారు. అదే సమయంలో ఒకప్పుడు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. అయితే ఇప్పుడు మాత్రం ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి స్టార్ హీరోలు అందరూ సిద్ధం అవుతున్నారు.
సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్, చిరంజీవి యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అలాగే అవసరం అయితే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటున్నారు. తాజాగా విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ వేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చివరిగా నటించిన మూడు సినిమాలు మల్టీ స్టారర్ జోనర్ లోనే తెరకేక్కడం విశేషం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి స్టార్స్ అందరూ నటించారు. ఇక ఆచార్యలో రామ్ చరణ్ సెకండ్ లీడ్ గా నటించారు.
ఇక తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ సెకండ్ లీడ్ గా నటించాడు. త్వరలో రవితేజ మానాడు రీమేక్ లో మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ వైపు సోలోగా రానిస్తూనే మరో వైపు స్టార్ హీరోల చిత్రాలలో కూడా కీలక పాత్రలలో కనిపిస్తున్నాడు. యంగ్ హీరోలు కూడా డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేయడమే కాకుండా ఇతర హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే కోలీవుడ్ హీరోలు కూడా మల్టీ స్టారర్ కథలకి పచ్చజెండా ఊపుతున్నారు.