Wed. Jan 21st, 2026

    Tollywood: కాజల్ అగర్వాల్ ఎట్టకేలకి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసింది. నట సింహం నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాతో కాజల్ రీ ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సింది. అఫీషియల్‌గా సైన్ కూడా చేశారు. కానీ, గర్భం దాల్చడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఓ బిడ్డకి జన్మనిచ్చిన కాజల్ ఇప్పట్లో మొహానికి రంగేసుకోవడం కష్టం అనుకున్నారు.

    కానీ, అందరూ అనుకున్నదానికి భిన్నంగా ‘భగవంత్ కేసరి’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికి కాజల్ చేసింది ‘భగవంత్ కేసరి’ లో అంత గొప్ప క్యారెక్టరేమీ కాదు. శ్రీలీలతో పోల్చుకుంటే తేలిపోయిందనే మాట రిలీజయ్యాక చాలామంది అన్నారు. కానీ, కాజల్ గతంలో మేకర్స్‌తో మేయిన్‌టైన్ చేసిన రాపో వల్ల ఆమెకి కొత్త సినిమాలలో ఛాన్సులివ్వడానికి దర్శకనిర్మాతలు ముందుకు వస్తున్నారట.

    tollywood-Kajal Aggarwal as much remuneration as he has asked for?
    tollywood-Kajal Aggarwal as much remuneration as he has asked for?

    Tollywood: కాజల్ పూర్తి చేయాల్సిన పాన్ ఇండియా సినిమా ఉంది.

    ఇప్పటికే, కాజల్ పూర్తి చేయాల్సిన పాన్ ఇండియా సినిమా ఉంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’లో మేయిన్ హీరోయిన్ కాజల్. అయితే, ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా బయటకి వచ్చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ చందమామ అదృష్ఠం కొద్దీ ‘ఇండియన్ 2’ ఆలస్యం అవడంతో శంకర్ మళ్ళీ కాజల్ నే తీసుకున్నారు. ఈ వరుసలో మళ్ళీ ఫాంలోకి వచ్చిన కాజల్ హీరోయిన్‌గా కమిటయ్యే సినిమాకి రెమ్యునరేషన్ మాత్రం పెద్దగా డిమాండ్ చేయడం లేదని సమాచారం.

    tollywood-Kajal Aggarwal as much remuneration as he has asked for?
    tollywood-Kajal Aggarwal as much remuneration as he has asked for?

    గతంలో ఎలాగైతే నిర్మాతల హీరోయిన్ అనిపించుకుందో ఇప్పుడు కూడా తనకి మంచి టీమ్, సక్సెస్ తప్ప ముందు రెమ్యునరేషన్ టాపిక్ అంతగా పట్టించుకోవడం లేదట. రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ కి అవకాశాలు దక్కించుకోవడమే మేయిన్ గోల్ గా పెట్టుకున్నారని అందుకే, నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా వారు చెప్పిన రెమ్యునరేషన్ కి కాస్త అటు ఇటుగా ఓకే చెప్పేస్తుందట. ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ సీనియర్ హీరోలకి బెస్ట్ ఆప్షన్ కాజల్ అని ఫిక్సవచ్చు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.