Categories: Devotional

Tirumala: ఏడాదిలోపు చిన్నారులతో తిరుమల వెళ్తున్నారా? ఇలా చేస్తే దర్శనం ఫ్రీ..

Tirumala: కలియుగ దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. ఇందులో పండు ముసలి వాళ్ళతో పాటు చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ లకు ప్రత్యేక దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిన్నపిల్లలతో తిరుమల వెళ్లే భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఏడాదిలోపు వయసు ఉన్నటువంటి పిల్లలతో కలిసి తిరుమల వెళ్తున్న తల్లిదండ్రులు సుపదం ఎంట్రెన్స్ ద్వారా ఉచిత ప్రవేశ దర్శనాలను కల్పిస్తోంది. ఈ ప్రత్యేక దర్శనం ద్వారా సుమారు ఒక గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే దర్శనం పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ దర్శనం కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉంటాయనే విషయానికి వస్తే.. సుపదం ఎంట్రన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే వారు తమ బిడ్డ వయసుకు సంబంధించి భర్త సర్టిఫికెట్ తో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కూడా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

Tirumala free darshan for parents children below one year under supadam entrance know details

Tirumala: సుపదం ఎంట్రన్స్ ద్వారా ఉచిత దర్శనం..

ఇలా ఈ డాక్యుమెంట్స్ తో తిరుమలలోని సుపదం ఎంట్రన్స్ వద్దకు వెళ్లాలి. ఈ దర్శనం కోసం ఎలాంటి టికెట్లు అవసరం లేదు. దర్శన సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా ఏడాదిలోపు వయసున్న చిన్నారులు తల్లితండ్రులు ఉచితంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ దర్శనానికి వెళ్లేవారు పిల్లలకు సంబంధించిన కొన్ని వస్తువులను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. చిన్నారులకు అవసరమైన పాలు నీళ్లు డైపర్లు వెంట తీసుకెళ్లాలి అదేవిధంగా చిన్నారులకు అవసరమైన మెడిసిన్ కూడా తల్లిదండ్రులు వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్నారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో పాటు చిన్నారి బర్త్డే సర్టిఫికెట్ కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెంట తీసుకువెళ్లాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో దర్శనం కోసం ఒక అరగంట అదనపు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.