Fri. Jul 11th, 2025

    The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన రానా దగ్గుబాటి సరికొత్త కాన్‌సెప్ట్ తో సెలబ్రిటీ షో ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే రానా ‘నంబర్ వన్ యారి’ అనే సెలబ్రిటీ టాక్ షోని సిరీస్ గా రూపొందించి సౌత్ లో బాగా పాపులర్ అయ్యారు. కొన్ని గ్రాండ్ ఈవెంట్స్ కి రానా హోస్ట్ గా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

    స్మాల్ స్క్రీన్ మీద మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నాని, ఎన్.టి.ఆర్, తమన్నా భాటియా, సమంత, లక్ష్మీ మంచు లాంటి వారు హోస్ట్ గా ఆకట్టుకున్నారు. ఇక ఆహా ఓటీటీలో నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ అంటూ వరుస సీజన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

    the-rana-daggubati-show-trailer-ranas-new-talk-show-celebrities
    the-rana-daggubati-show-trailer-ranas-new-talk-show-celebrities

    The Rana Daggubati Show Trailer: ఫన్ తో పాటు కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ 

    ఈ క్రమంలో రానా కూడా మరోసారి ‘ది రానా దగ్గుబాటి షో’ అంటూ రాబోతున్నారు. తాజా ట్రైలర్ చూస్తే కాన్‌సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తే ఇప్పటికే, మన తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్ళిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రీలీల, ప్రియాంక అరుళ్ మోహన్, మీనాక్షి చౌదరి.. కుర్ర హీరోలు అక్కినేని నాగ చైతన్య, నాని, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, దుల్కర్ సల్మాన్, సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మలకి సంబంధించిన ఎపిసోడ్స్ షూట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. అంతే కాదు రానా భార్య మిహికా బజాజ్ కూడా ఈ షోలో భాగం అయ్యారు.

    ఫన్ తో పాటు కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా రానా ఈ షోలో అడగబోతున్నట్టు హింట్ ఇచ్చారు. హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో సరైన సినిమాలు రాక జనాలకి ఎంటర్‌టైన్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ‘ది రానా దగ్గుబాటి షో’ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ని ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజా ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.