Thu. May 28th, 2026

    Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో తామే గెలుస్తామని, విపక్షాలకు చాన్స్ లేదని రేవంత్ గట్టిగా సవాల్ విసురుతున్నారు. ఈ పొలిటికల్ స్పీడ్‌కు బ్రేకులు వేయడమే లక్ష్యంగా, గులాబీ గుటిలో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. 2028 ఎన్నికల యుద్ధానికి కేసీఆర్ ఒక సంచలన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

    ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం… పార్టీ భవిష్యత్తు వారసుడిగా కేటీఆర్‌ను అధికారికంగా లైన్‌లోకి తీసుకురావడం. అయితే, ఇన్నాళ్లూ తెరవెనుక నడిచిన ఒక పెద్ద చర్చకు ఇప్పుడు తెరపడినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. పార్టీ కోసం, కుటుంబం కోసం ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఒక పెద్ద త్యాగానికి సిద్ధపడ్డారని, దీంతో కేటీఆర్‌కు రూట్ పూర్తిగా క్లియర్ అయిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

    telangana-politics-harishs-sacrifice-the-route-is-clear-for-ktr
    telangana-politics-harishs-sacrifice-the-route-is-clear-for-ktr

    Telangana Politics: కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అనే చర్చ ఈనాటిది కాదు. 

    ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వయసు 70 దాటింది. 2028 ఎన్నికల నాటికి ఆయన 75వ పడిలోకి అడుగుపెడతారు. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ యువ నాయకత్వం ప్లస్ పాయింట్ కాకుండా చూడాలన్నది గులాబీ పెద్దాయన ఆలోచన. రేవంత్ రెడ్డి దూకుడుకు చెక్ పెట్టాలంటే.. 54 ఏళ్ల యువ నాయకుడైన కేటీఆర్‌ను నెక్స్ట్ సీఎం ఫేస్‌గా ముందే ప్రకటించి బరిలోకి దింపడమే కరెక్ట్ అని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జెన్ జీ, అలాగే యూత్ ఓటర్లను ఆకట్టుకోవడానికి కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

    పార్టీలో నెంబర్-2 స్థానం కోసం, కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అనే చర్చ ఈనాటిది కాదు. కానీ, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవడం అందరి కంటే ముఖ్యం. అందుకే, గులాబీ కుటుంబం అంతా కలిసి కూర్చుని ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కేటీఆర్ నాయకత్వానికి పూర్తి మద్దతు ఇచ్చేందుకు, ఆయన వెనుక నమ్మకమైన సైనికుడిగా నిలబడేందుకు హరీష్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ అంతర్గత ఫ్యామిలీ ప్యాక్ట్ వల్లే కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పూర్తి స్వేచ్ఛ లభించిందని, ఎన్నికల రూట్ మ్యాప్ మొత్తం ఆయనే డిజైన్ చేస్తున్నారని అంటున్నారు.

    ఇకపై పార్టీ ఆపరేషన్స్ అన్నీ కేటీఆరే చూసుకుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను ఉరకలెత్తించడానికి కేసీఆర్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోనున్నారు. పెద్దాయన ప్రజాదరణ, కేటీఆర్ ఆధునిక వ్యూహాలు, హరీష్ రావు క్షేత్రస్థాయి మేనేజ్‌మెంట్… ఈ ముగ్గురి కలయికతో కాంగ్రెస్‌కు రివర్స్ గేర్ వేయాలని బీఆర్ఎస్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.