Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ గత కొంత కాలంగా బిజీగా ఉంటోంది. సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు చేస్తూ ఓటీటీలో అదరగొడుతోంది. ఇండస్ట్రీకి వచ్చి చానాళ్లవుతున్నా ఇంకా తమన్నా క్రేజ్ తగ్గలేదు. తమన్న తెలుగులో శ్రీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాకు అంత హిట్ టాక్ రాలేదు. కానీ తమన్నాకు క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది అదే హ్యాపీ డేస్ . శేఖర్ కమ్ముల తీసిన ఈ మూవీతో తమన్నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోలతో జోడీ కట్టి తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. అయితే గత ఇక దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ఆమె చేసిన జైలర్, లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లతోనూ హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు బాక్, ఓదెల-2 వంటి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంతో తమన్నా పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. తమన్నా పెళ్లికి ముందే తల్లి కాబోతోందన్న రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ వార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.
తమన్నా బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తోంది. గత కొద్ది కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అంతే కాదు త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. దీంతో నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ కెమెరాకు చిక్కుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు.లేటుస్టుగా ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పెళ్లి కాకముందే తమన్నా తల్లి కాబోతున్నట్లు పుకార్లు జోరుగా నెట్టింట్లో వినిపిస్తున్నాయి. తమన్న-విజయ్ పిల్లల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి కాకముందే ఓ బిడ్డను కనాలని ఈ కపులు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ముందు పిల్లలను కన్నాకే పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ అనుకుంటున్నట్లు టాక్. పిల్లలు పుడితే బాధ్యతలు తెలుస్తాయని వీరిద్దరి డిస్కస్ చేసుకున్నారట. ఈ సీక్రెట్ విషయం కాస్త బయటకు రావడంతో న్యూస్ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్స రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ను మరింత ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లలేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ న్యూస్ లో నిజమెంత ఉందనేది తెలియనప్పటికీ ప్రస్తుతం తమన్నా న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఇక ఆమె అభిమానులు వాటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.