Categories: EntertainmentLatest

Varalaxmi Sharathkumar : నా గురించి మాట్లాడటానికి మీరెవరు?

Varalaxmi Sharathkumar : సౌత్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రూటే సపరేటు. ఆమె ఎంత కూల్ గా ఉంటారు, తేడా వస్తే అంతే రఫ్‌గా ఎవరైనా సరే దుమ్ముదులిపేస్తారు. నిర్మొహమాటంగా ముగ్గుసూటిగా మాట్లాడే నటి వరలక్ష్మీ . ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా చేయగల టాలెంట్ ఆమె సొంతం. అందుకే తమిళం, తెలుగు అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో వరలక్ష్మీ రాణిస్తోంది. ఉమెన్‌ సెంట్రిక్‌ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మధ్యనే వరలక్ష్మీ నటించిన శబరి సినిమా విడుదలైంది . ప్రస్తుతం పలు చిత్రాలు ఆమె లైనప్ లో ఉన్నాయి. అంతేకాదు రీసెంట్ గా వరలక్ష్మీ ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఈ క్రమంలో తాజాగా వరలక్ష్మీ ఓ ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేసే వారి దుమ్ముదులిపేసింది.

varalaxmi-sharathkumar-serious-reaction-on-negative-comments-about-her

వరలక్ష్మీ కోలీవుడ్ నటుడు శరత్‌కుమార్‌ కూతురు. ఈ విషయం అందరికీ తెలుసు. శరత్ కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పుట్టిన పాపే వరలక్ష్మీ. ఆ తరువాత కొన్ని కారణాలతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం శరత్‌కుమార్‌ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్‌ అనే కొడుకు ఉన్నాయి. అయితే ప్రస్తుతం శరత్‌కుమార్‌ ఫస్ట్ వైఫ్ ఛాయ, రాధికలతో కలిసి మెలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే జరిగిన వరలక్ష్మీ ఎంగేజ్‌మెంట్‌ లో వీరంతా కలికట్టుగా కనిపించారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి. దీనిపై సీరియస్ అయ్యింది వరలక్ష్మీ. తమ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి మీరెవరూ అంటూ ట్రోలర్స్ పై మండిపడుతోంది.

varalaxmi-sharathkumar-serious-reaction-on-negative-comments-about-her

ఇంటర్వ్యూలో వరలక్ష్మీ మాట్లాడుతూ..” అసలు నా గురించి నా ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి మీరెవరు? మీరు కామెంట్స్‌ చేసే వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి మీకు ఏం తెలుసని మాట్లాడతారు. ఓ పోజిషన్ కి వచ్చారంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా? ఇవేమీ ఆలోచించకుండా నాలిక ఉంది కదా అని చాలా ఈజీగా కామెంట్స్‌ చేస్తారు. హీరోహీరోయిన్లు ఇతరులకు సాయం చేయలేదని మీరు కామెంట్లు పెట్టేకంటే .. మీరెందుకు సాయం ఎందుకు చేయరు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే రెమ్యునరేషన్ చాలా తక్కువ. మాకు డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదే. షూటింగ్‌ లేకపోతే ఇన్‎కమ్ ఉండదు. కానీ కొంత మంది మేము చాలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామని ఫీల్ అవుతుంటారు. కానీ వాస్తవిక పరిస్థితులు అలా ఉండవు. మాకు ప్రతి నెల జీతాలు రావు. కానీ నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు ఇవ్వాల్సి . షూటింగ్‌ ఉంటేనే డబ్బులు లేకపోతే లేదు. అందుకే మాది చాలా రిస్కీ జాబ్”. అని చెప్పింది వరలక్ష్మీ శరత్‌కుమార్‌ .

Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

7 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

7 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

7 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.