Wed. Jan 21st, 2026

    Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం చూపించారు. నడుచుకుంటుంటూ వస్తున్న సమయంలో గుంపులో వస్తున్న ఓ వ్యక్తి శ్రీలీల చేయి పట్టుకుని బలవంతంగా లాగాడు. దీంతో, ఆమె వారి వైపు పడబోయారు. సోషల్ మీడియాలో దీనికి సంబందించిన విజువల్స్ ప్రస్తుతం బాగా వైరల్‌ అవుతున్నాయి.

    తెలుగులో శ్రీలీల నితిన్ సరసన నటించిన ‘రాబిన్‌హుడ్’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మధ్య శ్రీలీలకి వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా అవకాశాలకి కొదవలేదు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు కమిటైయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ సరసన ఒక సినిమాను చేస్తున్నారు. అనురాగ్‌ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రం ఆషికీ సీక్వెల్ అని తెలుస్తోంది.

    sreeleela-a-bitter-experience-for-a-young-heroine-in-darjeeling
    sreeleela-a-bitter-experience-for-a-young-heroine-in-darjeeling

    Sreeleela: శ్రీలీల చేయి పట్టుకుని లాగాడు.

    కాగా, ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా చిత్రయూనిట్ ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. షూటింగ్ పూర్తయ్యాక శ్రీలీల.. కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి తిరిగి వస్తుండగా.. ఈ జంటను చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఒకడు శ్రీలీల చేయి పట్టుకుని లాగాడు. చుట్టూ బాడీగార్డులు ఉన్నా కూడా గుంపులో నుంచి కొంతమంది పోకిరీలు ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీంతో శ్రీలీల ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే వారి వెంట ఉన్న బాడిగార్డ్స్ అప్రమత్తమవడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.