Wed. Jan 21st, 2026

    Spirit: ‘ప్రభాస్ ని రాజమౌళి కంటే గొప్పగా చూపిస్తా’..అంటూ తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అన్నారు. ఇంతకాలం సందీప్ ‘యానిమల్’ సినిమాతో ప్రభాస్ ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని అందుకున్నాయి. ఇపుడు సందీప్ రెడ్డి వంగ ఫ్రీ అయ్యాడు.

    ప్రభాస్ మాత్రం ప్రస్తుతం ‘కల్కి’ సినిమాతో పాటు మారుతి సినిమాను చేస్తున్నాడు. అయినా సందీప్ తో సినిమాకి ఈ ఫిబ్రవరి నుంచి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సందీప్ కూడా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడో క్లారిటీ ఇచ్చాడు సందీప్.

    spirit- 'If you show Prabhas better than Rajamouli'..Sandeep Reddy Vanga
    spirit- ‘If you show Prabhas better than Rajamouli’..Sandeep Reddy Vanga

    Spirit: ప్రభాస్ ని ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా

    ప్రభాస్ ని ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా ఏ దర్శకుడూ చూపించని విధంగా చూపించబోతున్నాను అని అన్నాడు. ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ ని చూస్తే ‘ఐఫీస్ట్’ లా ఉంటుందని అందరికీ గ్యారెంటీ ఇచ్చాడు. ఈ స్టేట్‌మెంట్‌తో ‘స్పిరిట్’ మూవీపై అంచనాలు భారీ లెవల్‌లో మొదలయ్యాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలు చూసిన తర్వాత ప్రేక్షకులందరూ సందీప్ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టేసుకున్నారు.

    త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ గెటప్, రోల్ ఎలా ఉండబోతుందో..అనే ఆతృతతో ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు సందీప్ తీసిన సినిమాలలో హీరోల కంటే ప్రభాస్ ని మరో రేంజ్ లో చూపించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. ఇక సందీప్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే ఇప్పటి వరకూ ప్రభాస్ ని రాజమౌళి కూడా చూపించని విధంగా బిగ్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.