Categories: Tips

Spirtual: ఈ నెల 30న సోమవతి అమావాస్య… పొరపాటున కూడా అలాంటి పనులు చేయొద్దు

Spirtual: ప్రతినెలలో అమావాస్య తిథి వస్తుంది. ప్రతి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం అమావాస్య, పౌర్ణమి అనేవి ఎంతో విశేషం కలిగి ఉన్న రోజులు. ఆయా రోజులలో  దేవతారాధన ఉంటుంది. వీటిని cవిశేషంగా నమ్ముతారు. ఇప్పటికి చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వీటిని నమ్మేవారి సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగింది. అలాగే ప్రత్యేక తిథులలో పూజలు, వ్రతాలు ఆచరించడం కూడా చేస్తున్నారు.

సనాతన ధర్మంలో ఈ ఆచార వ్యవహారాలకి ప్రత్యేక విశేషం ఉంటుంది. వీటిని చాలా నియమ నిష్ఠలతో చేయాలి. ఇలా చేయడం వలన గత జన్మల కర్మల నుంచి విముక్తి లభించడంతో పాటు ఈ జన్మలో తెలిసి, తెలియక చేసిన పాపకర్మల నుంచి కూడా విముక్తి లభిస్తుందని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అరుదైన సందర్భాలు కూడా ఉంటాయి.

somvati-amavasya-has-a-very-special-significance-in-hinduism

అలా ఈ నెల 30న వచ్చే అమావాస్యకి ప్రత్యేకత ఉంది. దీనిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా అరుదుగా వస్తుందని చెబుతున్నారు. ఈ రోజునే శని జయంతి, వట సావిత్రి వ్రతం కూడా రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుమారు 30 ఏళ్ల తర్వాత ఒకే రోజున మూడు పండుగలు రావడం ప్రత్యేకత అని చెప్పాలి. ఈ రోజున పరమశివుడిని ప్రత్యేకముగా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున మన పూర్వీకులని స్మరించుకుంటూ సామర్ధ్యం కొద్ది దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

అలాగే లక్ష్మీదేవి పూజ చేస్తే ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. అలాగే ఈ రోజున రావిచెట్టుకి స్త్రీలు పూజలు చేసి, ప్రదక్షిణాలు చేస్తే ఎంతో శుభ ఫలితాలు పొందవచ్చని కూడా చెబుతున్నారు. అయితే నిష్ఠతో ఈ రోజులు పూజలు చేయడం ఎంత ముఖ్యమో అలాగే కొన్ని పనులకి దూరంగా ఉండటం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజున మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు. అలాగే జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. రావిచెట్టుని పూజించే సమయంలో పొరపాటున కూడా చెట్టుని తాకకూడదు. అలాగే ఎవ్వరినీ దూషించకూడదు. ఇలా చెడుపనులు చేస్తే దుష్ఫలితాలు సంభవించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.