Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు అయితే భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రహ్మోత్సవాలు రాని వచ్చాయి. స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే సంగతి తెలిసిందే అయితే ఈ ఏడాది సాల కట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ ను టీటీడీ అధికారులు తెలియ చేశారు. మరి సాల కట్టి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏ తేదీ ఏ ఉత్సవాలు జరగబోతున్నాయి అనే విషయానికి వస్తే..
సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
15/09/2026: సాయంత్రం ధ్వజారోహణం,రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
16/09/2026 : ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
17/09/2026: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,
18/09/2026 :ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,
19/09/2026: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం
20/09/2026: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.
21/09/2026 :ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,
22/09/2026: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,
23/09/2026: ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం.
ఈ విధంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లను మొదలుపెట్టారు. అదేవిధంగా వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.