Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంట్లో చెప్పులు వేసుకుని నడిచే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో అధికమైంది. సాధారణంగా బయటకు వెళ్లే సమయంలో చెప్పులు వేసుకోవడం అనేది సహజం కానీ ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదేనా? చెప్పులు వేసుకుని నడవటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవా? చెప్పులు వేసుకుని నడవడం మంచిదేనా? కాదా? నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో చెప్పులు వేసుకోవడ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని వేసుకోకపోవడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. మన పాదాలలో పట్టు పెరగడానికి అలాగే పాదాలలో ఉన్నటువంటి చిన్న కండరాలు చురుగ్గా పనిచేయాలి అంటే చెప్పులు లేకుండా నడవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో వారి నడక తీరు అలాగే శరీర భంగిమ మెరుగు పడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చెప్పులు లేకుండా నడవడం అనేది గడ్డి, మట్టి వంటి సహజ ఉపరితలాలపై నడిచినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలు ఉంటాయి.
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించే సమయంలో ఇంటి లోపల మార్బల్స్ గ్రానైట్ వంటి వాటిని వేస్తున్నారు .ఇలాంటి వాటిపై ఎక్కువసేపు నడవడం వల్ల మడమలు, పాదాల ఆర్చ్‌పై అధిక ఒత్తిడి పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్లాంటర్ ఫాసియాటిస్, ఫ్లాట్ ఫీట్ లేదా మడమ నొప్పితో బాధపడేవారు ఎక్కువసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. ఇక వంట గదిలో ఎక్కువసేపు ఒకే చోట నిలబడి పనిచేసే వారు మంచి నాణ్యత కలిగిన, ఆర్చ్ సపోర్ట్ మరియు కుషనింగ్ ఉన్న చెప్పులు ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి చెప్పులు పాదాలపై పడే ఒత్తిడిని సమానంగా పంచి, మడమలు, మోకాళ్లు, నడుముపై ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇక మధుమేహంతో బాధపడే వారి పాదాలకు స్పర్శ తగ్గుతుంది కనుక చిన్న గాయం తగిలిన మనకు తెలియదు తద్వారా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. అందుకే మధుమేహంతో బాధపడే వారు తప్పనిసరిగా ఇంట్లో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవాలని నిపుణులు చూచిస్తున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.