Categories: Tips

Health: మీ జుట్టుని సంరక్షించే కలబంద షాంపూ… ఇంట్లోనే చాలా సులభంగా

Health: మహిళలకి అందం అంతా వారి జుట్టులోనే ఉంటుంది. అలాగే వారు పెంచుకునే కురులను బట్టి వారి ఆహార్యం, వ్యక్తిత్వాన్ని కూడా చెప్పొచ్చు అని కొందరు అంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడవాళ్లు జుట్టు ఏపుగా పెంచుకోవడానికి ఇష్టపడతారు. సిటీలో ఉండే మహిళలు అయితే పొడవాటి జుట్టు పెంచుకున్న స్టైలిష్ గా లూజ్ హెయిర్ ని మెయింటేన్ చేస్తూ, కొత్త కొత్త లుక్స్ తో కనిపించడానికి ఇష్టపడతారు. అయితే మహిళలకి జుట్టు ఊడిపోతుంది అంటే వారికి ఎక్కడలేని టెన్షన్ వచ్చేస్తుంది.

ఓ విధంగా మహిళలలో ఈ జుట్టు ఊడిపోవడం అనేది ఆత్మన్యూనతకి కారణం అవుతుందని కూడా చాలా అధ్యయనాల్లో నిరూపితం అయ్యింది. స్త్రీలు చర్మ సంరక్షణ కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో అంతకంటే ఎక్కువగా జుట్టుని సంరక్షించుకునే ప్రయత్నం చేస్తారు. వారి అందాన్ని రెట్టింపు చేసే జుట్టు అంటే ఓ విధంగా వారికి ప్రాణంతో సమానం అని చెప్పాలి. అయితే ఈ కాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా పెరిగిపోతున్న కాలుష్యం, ఎండలు, దుమ్ము, దూళి కారణంగా మహిళల్లో తరుచుగా జుట్టు ఊడిపోవడం జరుగుతుంది.

homemade-aloe-vera-shampoo-for-hair-loss

ఈ సమస్యని కంట్రోల్ చేసుకోవడానికి వారు మార్కెట్ లో లభించే అన్ని రకాల కాస్మొటిక్స్ వాడుతారు. అలాగే రకరకాల హెయిర్ ఆయిల్స్ కూడా వాడుతూ ఉంటారు. కొంత మంది హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే జుట్టు ఊడిపోవడం అనేది ఇప్పుడు బాగా ఎక్కువ అయ్యింది కానీ పూర్వకాలంలో మహిళలు ఎలాంటి కాస్మొటిక్స్ వాడకుండానే సహజసిద్ధం ఉత్పత్తులతోనే పొడవైన జుట్టు కలిగి ఉండేవారు. సహజంగా లభించే కుంకుడు కాయ, షీకాకాయలని దంచి వేడినీటిలో వాటిని వేసి ఆ నీటితో తలంటు పోసుకునే వారు.

అయితే ఇప్పుడు అవి చాలా వరకు కనుమరుగైపోయాయి. అయితే జుట్టు ఊడిపోకుండా నిగారింపుతో ఉంచుకోవడంతో పాటు, పొడవుగా పెంచుకోవడానికి అలోవెరా షాంపూలు ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. అయితే వీటిని హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  అలోవెరా ఆకుల నుంచి జెల్ ని తీసుకోవాలి. ఒక పాన్ లో లో కొద్దిగా సబ్బు లేదా షాంపూని అది కరిగిపోయే వరకు వేడిచేయాలి. అందులో అలోవెరా జెల్ తో పాటు విటమిన్ ఈ, జొజోబా ఆయిల్ ని కలపడంతో షాంపూ రెడీ అయిపోతుంది. తలంటూ చేసుకునే సమయంలో ఈ షాంపూని బాగా షేక్ చేసి ఉపయోగించాలి. ఈ అలొవేరా షాంపూ తలలో దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ ని దూరం చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ పదార్ధాలు దురదని తగ్గిస్తాయి. అలాగే జుట్టుని మృదువుగా ఉంచుతుంది.

Varalakshmi

Recent Posts

Anikha Surendran : నేను మనిషినే..ట్రోలింగ్‎పై నటి ఎమోషనల్

Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చింది అనిఖా సురేందరన్. తన క్యూట్ యాక్టింగ్ తో…

11 hours ago

White Onion: తెల్ల ఉల్లిపాయను తీసుకుంటున్నారా…. ఈ ప్రయోజనాలు మీ సొంతం?

White Onion: ప్రస్తుత కాలంలో ఉల్లిపాయలు లేనిదే ఏ ఆహారం తయారు చేయరు. ఉల్లిపాయను కేవలం ఆహార పదార్థాలను రుచిగా…

11 hours ago

Spirituality: శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా కింద పెట్టని వస్తువులు ఇవే?

Spirituality: మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల…

11 hours ago

NTR Devara : పిచ్చెక్కిస్తున్న దేవర సాంగ్.. అనిరుథ్ అరిపించాడుగా

NTR Devara : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. సీనియర్ హీరో తాత నందమూరి…

16 hours ago

Heeramandi Actress : ఫోన్ చేసి రమ్మంటారు..కానీ

Heeramandi Actress : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి ది డైమండ్ బజార్ సిరీస్…

2 days ago

Naga Babu : నేను డిలీట్ చేశా..మళ్లీ గెలిగిన నాగబాబు

  Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట్లో జరిగే ప్రతి…

3 days ago

This website uses cookies.