Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చింది అనిఖా సురేందరన్. తన క్యూట్ యాక్టింగ్ తో మలయాళ, తమిళ ,తెలుగు సినీ అభిమానులకు దగ్గరైంది. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిగ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. బుట్ట బొమ్మ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనిఖా స్క్రీన్ మీద బాగున్నా వర్కౌట్ కాలేదు. అయితే తమిళ, మలయాళంలో మాత్రం ఎదో ఒక సినిమా చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో అనిఖా సోషల్ మీడియాలో తనపై వస్తున్న బ్యాడ్ కామెంట్లపై స్పందించింది. “ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లపై ఇలాంటి కామెంట్లు చేయడం సరదా అయిపోయింది. ఆకర్షణీయంగా కనిపించే అవుట్ ఫిట్స్ వేసుకోవడం నా పర్సనల్ విషయం. కానీ దానికి విమర్శలు వస్తాయి, పొగడ్తలు వస్తాయి. కానీ అవన్నీ కొద్ది కాలమే నిలుస్తాయి. ఇలాంటివి జీవితంలో ఒక భాగం మాత్రమే. మీరు ఎలాంటి బట్టలు తప్పుగా మాట్లాడేవారు అలాగే మాట్లాడతారు. నా డ్రెస్సింగ్ విషయంలో కొన్ని తప్పుడు కామెంట్స్ నన్ను చాలా బాధిస్తాయి. అవి నాపై ప్రభావం చూపుతాయి. నేను కూడా మనిషినే కదా”అని ఎమోషనల్ అయ్యింది అనిఖా.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో బాలనటిగా చక్కటి అభినయంతో అలరించింది అనిఖా. ఈ సినిమాతో ఈ అమ్మడికి తమిళంలో మంచి క్రేజ్ వచ్చింది. హీరోయిన్ మెటీరియల్ అంటూ అందరూ పొగడ్తలతో ముంచేవారు. ఆ తర్వాత ఇక నామ్ రౌడీ థాన్, మృధన్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ‘ఓ మై డార్లింగ్’అనే మూవీతో హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు తమిళ ఆది నిర్మిస్తున్న పిటి సర్ సినిమాలో నటిస్తోంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.