Categories: EntertainmentLatest

Anand Devarakonda : అన్నను తొక్కేయాలని ఆ బ్యాచ్ ట్రై చేస్తోంది

Anand Devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్‌రాజు నిర్మాణంలో , గీతా గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 5న ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయింది. తాజాగా ఈ మూవీపై విజయ్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ కి ముందే కొందరు కావాలని నెగెటివ్‌గా ప్రచారం చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ స్టార్‌లోని కొన్ని సీన్స్‌, ఫోటోలు, స్క్రీన్ షాట్లను తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని దాని ప్రభావం సినిమాపై పడి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టం మిగిలిందని చెప్పాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరోసారి ఫ్యామిలీ స్టార్ గురించి డిస్కషన్ జరుగుతోంది.

anand-devarakonda-sensational-comments-on-negative-publicity-on-family-star-movie

బేబీ వంటి హిట్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ ఇప్పుడు గం గం గణేశా అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్యామిలీ స్టార్ నెగెటివిటీ గురించి హీరో ఆనంద్ దేవరకొండను జర్నలిస్టులు ప్రశ్నించారు. దానికి ఆనంద్ స్పందించాడు. “కొన్ని ప్రాంతాల్లో కావాలనే విజయ్ ని టార్గెట్ చేసి ఫ్యామిలీ స్టార్ పై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. ఎవరైనా ఒకరు వాళ్ల సొంత అభిప్రాయాన్ని బయటకు చెప్పవచ్చు అందులో తప్పు లేదు. కానీ ఒక గ్రూపు గా ఫామ్ అయ్యి చాలామంది దానిని ట్రెండ్ చేసి ఆ సినిమాని చంపేసే ప్రయత్నం చేశారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు.

anand-devarakonda-sensational-comments-on-negative-publicity-on-family-star-movie

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కి 48 గంటలు ముందు నుంచే విజయ్ దేవరకొండ పాత మూవీస్ నెగిటివ్ టాక్ తీసుకొచ్చి ఫ్యామిలీ స్టార్ పబ్లిక్ టాక్ అని థంబ్ నెయిల్స్ అని పెట్టి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారు. ఇదంతా ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తున్న పని. అయితే అది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది మేం చెప్పలేం. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సినిమా చూసి నచ్చక పోతే నెగిటివ్ గా మాట్లాడవద్దు అని నేను అనడం లేదు. నిజానికి ఆ విషయంలో మనకి హక్కులు ఉన్నాయి. ఇలా ఒక వ్యక్తిని, ఒక సినిమాని టార్గెట్ చేసి ఎటాక్ చేయడం ఎందుకు? ఇదంతా వదిలేస్తే మా అన్న ఇకపై చేసే సినిమాలన్నీ చాలా మంచివే. మొన్ననే వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఆ మూడు మంచి టాక్ ను సొంతం చేసుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇలా విజయ్ ని టార్గెట్ చేస్తున్నది సినిమా వాళ్లా ? బయటివారా? అని అడిగితే… అదే తెలిస్తే పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇస్తాము” అని ఆనంద్ తెలిపాడు.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.