Sat. Jul 12th, 2025

    Samantha Ruth Prabhu : హెల్త్ ఇష్యూస్ కారణంగా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది సౌత్ బ్యూటీ సమంత. ప్రస్తుతం తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్స్ కారణంగా ఇన్నాళ్లు తన బాడీ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు ఫిట్ నెస్ కోసం, ఫన్ కోసం తన సమయాన్ని కేటాయిస్తోంది . అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ, ఫేవరెట్ మూవీస్ చూస్తూ, ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ సరదాగా గడుపుతోంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలను, స్టేటస్ లను అప్డేట్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఖుషి చేస్తోంది.. తాజాగా సమంత ఓ మలయాళ హీరోకు ఫిదా అయిపోయిందట. మలయాళీ సినిమా కాథల్ ది కోర్ చూసి సమంత ఇప్పటికీ అదే ట్రాన్స్‌లో ఉండిపోయిందట్. ఇది ఎవరో అన్నమాట కాదు సమంతనే తన ఎగ్జైట్మెంట్‌ను ఆపుకోలేక..తన ఇన్ స్టా స్టోరీలో కాథల్ ది కోర్ సినిమా అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించింది.

    samantha-ruth-prabhu-praises-mammootty-acting-in-kaathal-the-core-movie
    samantha-ruth-prabhu-praises-mammootty-acting-in-kaathal-the-core-movie

    మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి-జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కాథల్-ది కోర్‌’. ఈ మధ్యనే ఈ మూవీ విడుదల అయ్యింది. విమర్శకులు సైతం ఈ మూవీ సూపర్ అంటూ పొగడ్తలతో ముంచేశారు. ఇదివరకే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తీసిన దర్శకుడు జియో బేబీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలుసు. ప్రతి ఇంట్లో ఉండే కథనే ఎన్నుకుని అందరిని మూవీ కి కనెక్ట్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆయన టాలెంట్ ఏంటో ఈ సినిమాతో నిరూపించారాంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

    samantha-ruth-prabhu-praises-mammootty-acting-in-kaathal-the-core-movie
    samantha-ruth-prabhu-praises-mammootty-acting-in-kaathal-the-core-movie

    ఆర్డినరీ సబ్జెక్ట్‌ను సైతం ఆడియన్స్ కి నచ్చేలా ఎక్స్‌టార్డినరీగా తీయడంలో డైరెక్టర్ అరితేరి పోయారంటూ కొనియాడుతున్నారు మూవీ క్రిటిక్స్. అందుకే ఈ మూవీ కి సమంత కూడా ఫిదా అయిపోయింది. తన ఇన్ స్టా లో ‘‘కాథల్-ది కోర్‌’’ అద్భుతహా అంటూ పొగడ్తలతో ముంచేసింది. ఈ ఏడాదిలో ఇదే బెస్ట్ మూవీ.. అందరూ చూడాల్సిన పవర్ఫుల్ మూవీ ఇది.ఇప్పటితో మమ్ముట్టి నా హీరో. మీ నటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంకా నేను ఈ సినిమా ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నా. మంచి మూవీ చూస్తే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. లవ్యూ జ్యోతిక’’ అని స్టోరీ ని పోస్ట్ చేశారు.మూవీ డైరెక్టర్ జీయోబాబీని లెజెండ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

    samantha-ruth-prabhu-praises-mammootty-acting-in-kaathal-the-core-movie
    samantha-ruth-prabhu-praises-mammootty-acting-in-kaathal-the-core-movie

    సమంత పోస్ట్‌పై ‘కాథల్-ది కోర్‌’ మూవీ మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. ఆమెకు థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్‌ పెట్టారు. నవంబర్‌ 23న కాథల్-ది కోర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కి మంచి స్పందన వస్తోంది. రిలీజ్ కి ముందే ఈ చిత్రం న్యూస్ లో నిలిచింది. ఈ మూవీ లో స్వలింగ సంపర్కుల పట్ల సొసైటీ ప్రవర్తించే తీరును ఇందులో స్పష్టంగా చూపించారు.