Devotional Facts: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని ఆచార వ్యవహారాలను ఎత్తు పద్ధతిగా పాటించడం ఎంతో మంచిది. లేకపోతే నెగటివ్ ప్రభావం ఏర్పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలలో వాస్తు శాస్త్రాన్ని గట్టిగా విశ్వసిస్తూ ఉంటాము ముఖ్యంగా చనిపోయిన వారి ఫోటోల విషయంలో కూడా చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. చనిపోయిన వారి ఫోటోలను చాలామంది వారి ప్రేమకు గుర్తుగా ఇంటి నిండా వారి ఫోటోలను అలంకరించుకొని ఉంటారు.

ఇక చనిపోయిన వారు దేవుళ్లతో సమానమని వారి ఫోటోలను దేవుడు గదిలో పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుడు గదిలో పెట్టి పూజించడం మంచిదేనా పండితులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే.. శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుడు గదిలో పెట్టకూడదు. ఇలా దేవుడు గదిలో పెట్టడం వల్ల వారి ఇంట్లో ఎప్పటికీ మానసిక ప్రశాంతత ఉండదని కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను గోడకు ఎప్పుడు కూడా వేలాడతీయకూడదు.
చనిపోయిన వారి ఫోటోలను మనం పెట్టుకోవాలి అంటే ఏదైనా చెక్క బల్ల పై వారి ఫోటోలను పెట్టాలి కానీ గోడకు మాత్రం వేలాడ తీయకూడదు. ముఖ్యంగా బ్రతికున్న వారి ఫోటోలు పక్కన చనిపోయిన వారి ఫోటోలను పెట్టడం వల్ల బ్రతికున్న వారికి రోజురోజుకీ ఆయుష్ తగ్గుతుందని అందుకే ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకూడదని చెబుతున్నారు ఇక ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లు అయితే ఆ ఫోటోలు ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు గోడకు ఉండి వారి ముఖచిత్రం దక్షిణం వైపుకు ఉండేలా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఎప్పుడూ కూడా ఈ ఫోటోలను మనం ఇంట్లోకి రాగానే మనకు కనిపించే విధంగా ఉండకూడదు అలా ఉండటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.