Salaar Release Date : డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావటంతో ప్రేక్షకులు సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. నిజానికి ‘సలార్’. ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. దీనితో రిలీజ్ డేట్ అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు . అయితే తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వరల్డ్ వైడ్ గా సలార్ డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
డార్లింగ్ ప్రభాస్ వరుస ఫ్లాప్ లు వెంటాడాయి. సాహో, రాధే శ్యామ్ ఈ మధ్యనే విడుదలైన ఆదిపురుష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలాయి. మంచి సాలిడ్ హీట్ కోసం ప్రభాస్ ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు.అతని ఫ్యాన్స్ కూడా ప్రభాస్ బ్లాక్ బస్టర్ సాధించే మూవీ తో రావాలని ఆశ పడుతున్నారు ఈ క్రమంలోనే కే జి ఎఫ్ లాంటి ఖతర్నాక్ మూవీ అందించిన ప్రశాంత్ నీల్ తో జోడి కట్టాడు ప్రభాస్. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కేజీఎఫ్ లాంటి అద్భుతమైన చిత్రాలను అందించిన ప్రశాంత్ ప్రభాస్ తో తీసిన ఈ మూవీ కూడా డైనమైట్ ల ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
అయితే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన డుంకి మూవీ కూడా ఆ రోజే రిలీజ్ కి రెడీ అవుతోంది. సలార్, డుంకి ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఇదే విషయాన్నీ రెండు చిత్రాల ప్రొడ్యూసర్లు,డిస్ట్రిబ్యూటర్స్ కూడా అప్డేట్స్ ఇచ్చేశారు. దీనితో యుఎస్ లో ఈ రెండు చిత్రాలు డిసెంబర్ 21న విడుదల కానున్నాయి. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వస్తున్న మూవీ డుంకి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కూడా హిట్ అయితే షారుఖ్ హ్యాట్రిక్ సాధించినట్టే. ఇక ప్రభాస్ సినిమా సలార్ కూడా హిట్ పక్క అనే టాక్ తో నడుస్తోంది. చూడాలి మరి.. ప్రభాస్, షారుఖ్‌కు జరిగే బ్యాటిల్‌లో విజయం ఎవరిని వారిస్తుందో.