Salaar Part 1 – Ceasefire: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత అంతకు మించి హెవీ యాక్షన్ సీన్స్ ఇందులో ఉండబోతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్ నెలలోనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
కానీ, అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ కి వాయిదా వేశారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి ‘సలార్’ సినిమా విషయంలో పెద్ద కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చింది చిత్రబృందం. ‘కేఫీఎఫ్’ కూడా ఇలా రెండు భాగాలుగానే వచ్చింది. ‘సలార్’ సినిమా విషయంలోనూ ప్రశాంత్ నీల్ అదే ప్లాన్ చేశాడట.
Salaar Part 1 – Ceasefire: ఇప్పుడు కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కానీ, ఇప్పుడు కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘సలార్’ మొత్తం సినిమాను ఒకే భాగంలో రిలీజ్ చేస్తామని చెప్పడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘సలార్’ సిరీస్ అనగానే ప్రభాస్ అభిమానుల్లోనే కాదు, అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఇప్పుడు ప్రశాంత్ నీల్ అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేశారు. ‘రాధే శ్యామ్’ సినిమా నుంచి దర్శకనిర్మాతలు ప్రభాస్ సినిమా విషయంలో సరైన అప్‌డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా వాదనలకి దిగారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ నుంచి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలోని అభిమానులు ఆత్తగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, మేకర్స్ ఇలా కన్‌ఫ్యూజన్‌లో పెట్టడం మాత్రం ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది.