Sai Pallavi : సాయి పల్లవి ఈ పేరు వినగానే మన పిల్ల అన్న ఫీల్ కలుగుతుంది. పక్క రాష్ట్రం అమ్మాయి అయినప్పటికీ, తన నటనతో పాటు కట్టుబొట్టుతో తెలుగు అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ బ్యూటీ నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్నాయి. చాలామంది ప్రొడ్యూసర్లకి ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి.

గార్గే, విరాటపర్వం సినిమాల తర్వాత సినిమాలకు దూరం ఉంటూ వస్తుంది సాయి పల్లవి . కొంతమంది ఫేడౌట్ అయిపోయిందని రూమర్లు క్రియేట్ చేస్తుంటే మరి కొంతమంది పెళ్లి ఫిక్స్ అయింది అంటూ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత సాయి పల్లవికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ బడా డైరెక్టర్ నితీశ్ తివారీ ‘రామాయణం’ ఆధారంగా ఓ సినిమాను తీయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ న్యూస్ పై ఇప్పటి వరకు ఎలాంటి ఆఫీషియల్ అనౌన్సమెంట్ చేయలేదు. అయినా ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సాయి పల్లవి ముంబయిలో ఉందంటూ ఓ ఫ్యాన్ పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎన్నో ప్రశ్నలకు తెర తీసింది.

తాజాగా సాయి పల్లవి ముంబయికి వెళ్లిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సాయి పల్లవి రామాయణం సినిమాలో యాక్ట్ చేస్తుందనే వార్తలకు బలం చేకూర్చినట్లైంది. అప్పట్లో సాయిపల్లవి, రణ్‌బీర్‌లకు సంబంధించిన ఏఐ ఫొటో ఒకటి నెటిజన్లను ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సాయిపల్లవి ముంబయిలో ప్రత్యక్షమయ్యేసరికి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. దీనితో సాయిపల్లవి ముంబయిలో ఉన్న ఫొటోను చూసిన ఆమె ఫ్యాన్స్.. రామాయణం సినిమా షూటింగ్ కోసమే ఆమె వెళ్లినట్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

రామాయణాన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని చిత్ర డైరెక్టర్ భావిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ . వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి శ్రీలంకలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం శ్రీలంకలో భారీ సెట్టింగ్ వేయనున్నట్లు టాక్ . ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు వంతెన భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారట.