Mon. Jul 14th, 2025

    Sai Dharam Tej: నెటిజన్ అడగగానే 10 లక్షలు ఇచ్చేశాడు..అదీ మెగా హీరో అంటే..అని ఓ తాజా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మంచి స్టార్ డం సంపాదించుకుంటున్నారు. అభిమానులను మెప్పించడం కోసం డాన్సుల్లో, ఫైట్స్ లో, యాక్టింగ్‌లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు. కమర్షియల్ హీరోగా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నారు.

    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో అయినా మొదటి సినిమాకే చిరంజీవి పేరు వాడుకుంటున్నారు. రెండవ సినిమా నుంచి మాత్రం సొంతగా కష్టపడుతూ తమకంటూ బాక్సాఫిస్ వద్ద ఓ మార్కెట్ ని ఏర్పరుచుకుంటున్నారు. చిరంజీవి తర్వాత ఇండస్ట్రీకి పరిచయమైన నాగ బాబు నటుడిగా, నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్..ఏకంగా పవర్ స్టార్ ఇమేజ్ ని సాధించారు. ఆయన సినిమా రిలీజ్ అంటే బిజినెస్ అన్న సినిమా కంటే ఎక్కువగా అవుతుంది.

    sai-dharam-tej-When the netizen asked, he gave 10 lakhs..that's what a mega hero is
    sai-dharam-tej-When the netizen asked, he gave 10 lakhs..that’s what a mega hero is

    Sai Dharam Tej: ఫ్యూచర్‌లో ఖచ్చితంగా నేను చరణ్ కలిసి

    ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్..ఇలా ప్రతీ ఒక్కరూ ఓ స్టైల్ ని మేయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. మెగా మల్టీస్టారర్స్ కూడా టాలీవుడ్‌లో బాగా వస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో..మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంటారు.

    అలాగే, తాజాగా సాయి ధరమ్ తేజ్ నెటిజన్స్‌తో చాట్ చేశాడు. వారిలో ఒకరు చిరంజీవితో కలిసి ఎప్పుడు నటిస్తారు అని అడిగారు. ఆ ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్నా..అంటూ సమాధానమిచ్చాడు. ఇంకొకరు రామ్ చరణ్ తో కలిసి ఎప్పుడు నటిస్తారు..అని అడిగాడు. దానికి వెంటనే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా నేను చరణ్ కలిసి నటిస్తామని సమాధానమిచ్చాడు.

    ఈ క్రమంలో ఇంకో నెటిజన్..బ్రో.. ఒక 10 లక్షలుంటే పంపించు..అని అడిగాడు. దానికి సాయి ధరమ్ తేజ్ సీరియస్ అవకుండా బ్రహ్మానందం ఉన్న ఒక ఫన్నీ ఏమోజీనీ పంపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కన్వర్‌జేషన్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది. దాంతో ఇప్పుడు ఒత్తిడి సాయి ధరమ్ తేజ్ మీద పడింది. ఈసారి మెగా ఫ్యామిలీలో జరగబోయే పెళ్ళి ఈ మెగా మేనల్లుడిదే.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.