Virupaksha : యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కి హిట్ దక్కుతుందనుకుంటే..

Virupaksha : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది భారీ యాక్సిడెంట్ అయి పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైలాగులు చెప్పలేక చాలా ఇబ్బందులు పడ్డాడు సాయి తేజ్. అయినా మెగా హీరోలకి పట్టుదల ఎక్కువ. ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకూ నిద్రపోరు. ఈ మెగా మేనల్లుడు కూడా అంతే.

విరూపాక్ష సినిమా కోసం చాలా శ్రమించాడు. దీనికి కారణం ఇది ఒకరకంగా సాయి తేజ్ కి పునర్జన్మ కావడమే. ఇంకోటి కథ. ఇలాంటి కథను గతంలో ఈ మెగా హీరో టచ్ చేయలేదు. అన్నీ రకాలుగా ఈ సినిమా సాయి తేజ్ కి పెద్ద ఛాలెంజ్. అందుకే పెద్ద రిస్క్ చేసి ఫైనల్‌గా సూపర్ హిట్ కొట్టేశాడు. ఈ వారం బాక్సాఫీస్ వద్ద విడుదలైన సమయం నుంచి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపబడుతోంది.

sai dharam tej got hit with virupaksha-

Virupaksha : సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు విరూపాక్ష సినిమా చూసిన ప్రేక్షకులందరూ సూపర్ హిట్ అని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశం కావడంతో ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి లేవనివ్వకుండా సినిమా చివరి థ్రిల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే విరూపాక్ష సినిమాపై అంతగా అంచనాలు లేవనే చెప్పాలి. కానీ, వారి ఆలోచనను తలకిందులు చేస్తూ ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమాగా నిలిచింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక విరూపాక్ష సక్సెస్ క్రెడిట్ కొంత దర్శకుడు సుకుమార్ ఖాతాలోకి వెళుతుంది. అలాగే లక్కీ హీరోయిన్ అని చెప్పుకుంటున్న సంయుక్త మేనన్ కి దక్కింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో తనేంటో నిరూపించుకొని బాగానే గుర్తింపు సంపాదించుకున్నాడు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.