Thu. Jul 10th, 2025

    Renu Desai : ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. 70 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో జనసేనాని అభిమానులు సంబురాలు జరుపుకుంటున్నారు. అదే విధంగా సినీ అభిమానులు, పరిశ్రమలోని సెలబ్రిటీలు, నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    renu-desai-reaction-on-pawan-kalyan-victory-in-ap-elections
    renu-desai-reaction-on-pawan-kalyan-victory-in-ap-elections

    ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు పవన్ ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులు పోస్టులు పెడుతున్నారు. పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి,ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నితిన్, న్యాచురల్ స్టార్ నానిలు పవన్ కు నెట్టింట్లో అభినందనలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో పవన్ విక్టరీపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ నెట్టింట ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    renu-desai-reaction-on-pawan-kalyan-victory-in-ap-elections
    renu-desai-reaction-on-pawan-kalyan-victory-in-ap-elections

    పవన్ విక్టరీని ఉద్దేశిస్తూ రేణూ దేశాయ్ ఇలా పోస్ట్ చేసింది..”ఆద్య, అకీరాలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ తీర్పుతో ఏపీ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను”అంటూ రాసుకొచ్చింది. ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. పవన్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ మెగాస్టార్,నాగబాబు తమ సోదరుడికి విషెస్ తెలిపారు. లేటెస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం శుభాకాంక్షలు తెలిపాడు.

    renu-desai-reaction-on-pawan-kalyan-victory-in-ap-elections
    renu-desai-reaction-on-pawan-kalyan-victory-in-ap-elections

    ఈ అద్భుత విజయంపై పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు అని న్యాచురల్ స్టార్ నాని కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు. ఎంతమంది అవమానించినా మీ పోరాటం ఎందరికో స్ఫూర్తి. మీ విజయం ఒక కథ కాదు. అందరూ నేర్చుకోవాల్సిన పాఠం అని నాని పోస్ట్ చేశాడు.