Garuda Vardhanam: సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను మన ఇంట్లో నాటుకోవటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రంలో ఎంతో కీలకమైనటువంటి మనీ ప్లాంట్ తులసి ప్లాంట్ వంటి మొక్కలను మన ఇంటి ఆవరణంలో పెంచుకోవడం మనం చూస్తుంటామో అయితే గరుడ నంద వర్ధనం అనే మొక్కని మన ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు మరి ఈ మొక్కను మన ఇంట్లో పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..
గరుడ నంద వర్ధనం అనే ఈ మొక్క ప్రాంతాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. అయితే ఈ మొక్క పుష్పాలు ఐదు రెక్కలతో తెలుపు రంగులో ఉంటాయి అచ్చం ఇవి పారిజాతం పుష్పాలను పోలి ఉంటాయని చెప్పాలి. ఇక ఈ పుష్పాలతో శివుడికి పూజ చేయడం వల్ల శివుడు ఎంతో ప్రీతికరం చెందుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ పుష్పాలతో మహాలక్ష్మికి పూజ చేసి మనం ఏదైనా కోరికలను కోరుకుంటే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇలా ఈ గరుడ వర్ధనం పుష్పాలు పూజకు ఎంతో కీలకమైనవని ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామి వారు సంతోషించి వారి అనుగ్రహం మనపై కలిగిస్తారని తెలుస్తోంది. ఇక ఈ పువ్వులు కేవలం పూజకు మాత్రమే కాకుండా ఈ మొక్క నుంచి వచ్చే ఆకుల రసం వేర్లు వంటివి ఆయుర్వేదంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి ఈ మొక్క ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఈ మొక్క నుంచి వెలువడే ఆక్సిజన్ కూడా మనకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగించకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.