Health Tips: చలికాలం మొదలు కావడంతో వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో చాలామంది ఈ చలి తీవ్రత వల్ల దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఎన్నో రకాల మందులు వాడుతున్నప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనాలు లేకుండా పోయాయి. ఇలా దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
మన వంటింట్లో లభించే వంట దినుసులతోనే సహజసిద్ధంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు మనం తయారు చేసుకునే తాగే టీలో కాస్త అల్లం ముక్కలు వేసుకొని తయారు చేసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు అలాగే తులసి ఆకులను నేరుగా నమిలి మింగటం వల్ల కూడా కాస్త ఉపశమనం పొందవచ్చు. ఇకపోతే టి కి బదులుగా గ్రీన్ టీ తాగటం వల్ల అందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తొందరగా మనకు దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ప్రతిరోజు పాలు తాగే అలవాటు కనుక ఉంటే పాలులో చిటికెడు పసుపు వేసుకొని తాగటం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక ఒక గ్లాసు నీటిలోకి చిన్న అల్లం ముక్కలు రెండు మిరియాలు దాల్చిన చెక్క రెండు తులసి ఆకులను వేసి బాగా మరిగించి కాస్త తేనె కలుపుకొని తాగటం వల్ల తొందరగా దగ్గు జలుబు సమస్య నుంచి మనం ఉపశమనం పొందవచ్చు.