Wed. Jan 21st, 2026

    Rashmika Mandanna : సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీ రష్మికకు సంబంధించిన ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. డీప్ నెక్ తో ఉన్న టీ షర్ట్ లో రష్మిక ఎక్స్పోజింగ్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం పెద్ద సెన్సేషన్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. నిజంగా రష్మిక నేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ఒక ఫేక్ వీడియో. కొంతమంది ఆకతాయిలు రష్మిక ను ట్రోల్ చేసేందుకు చేసిన వీడియో ఇది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రష్మిక ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. ఈ విషయంపై ఇప్పటికే నేషనల్ క్రష్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు.

    rashmika-mandanna-amitabh-bachchan-reaction-on-video
    rashmika-mandanna-amitabh-bachchan-reaction-on-video

    చేతిలో స్మార్ట్ ఫోన్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, వందల కొద్ది ఆప్స్, హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. మన చుట్టూ ఏం జరుగుతుందో అసలు అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. టెక్నాలజీని ఉపయోగించుకుని కొంతమంది ఆకతాయిలు సామాన్యులతో పాటు , స్టార్‌ సెలబ్రిటీల కు చుక్కలు చూపిస్తున్నారు. వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. సోషల్‌ మీడియాలో చిత్ర విచిత్ర పోస్టులు చేసి పైశాచిన ఆనందాన్ని పొందుతున్నారు. ఆ ఫేక్ వీడియోలను చూసిన కొందరు నెటిజన్లు అవి నిజమేనేమో అని భ్రమపడుతున్నారు. లేటెస్ట్ గా కొందరు సౌత్ స్టార్‌ నటి రష్మిక మందన్నా ను టార్గెట్‌ చేశారు. ఆమె ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఓ అసభ్యకర వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం కాస్త పెద్ద దుమారం రేపుతోంది.

    rashmika-mandanna-amitabh-bachchan-reaction-on-video
    rashmika-mandanna-amitabh-bachchan-reaction-on-video

    వీడియోలో ఆకతాయిలు రష్మిక ఫుల్ ఎక్స్‌పోజింగ్‌ చేసినట్టు చూపించారు . వీడియో చూసిన వారంతా ఏంటి రష్మిక ఇలా తయారయింది అంటూ గుసగుసలు మొదలుపెట్టారు. అయితే ఈ వీడియోపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు విషయాన్నీ బయటపెట్టారు. ఇది ఫేక్ వీడియో అని నిజాన్ని నేటిజన్స్ ముందు ఉంచారు. నిజానికి ఈ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ది. ఆమె వీడియోని రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేశారు. దీంతో ఒరిజినల్‌ వీడియో, రష్మిక ఫేక్‌ వీడియోను షేర్‌ చేస్తూ ఆకతాయిలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నారు. నేటిజెన్స్ మాత్రమే కాదు ఈ వీడియో పై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా రియాక్ట్ అయ్యారు. ఫేక్ వీడియోపై ఫైర్ అయ్యారు. వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని అమితాబ్‌ డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఫేక్ వీడియో పై ఇప్పటివరకు రష్మిక స్పందించకపోవడం గమ్మినార్హం.

    ఇక రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ సహా బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌తో కలిసి రష్మిక ‘యానిమల్‌’ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్‌ 1న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. అలాగే సుకుమార్‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న అల్లు అర్జున్‌ పాన్‌ ఇండిమా మూవీ ‘పుష్ప-2’ లో కూడా రష్మిక నటిస్తోంది.