Pushpa 2 : ‘ఫుష్ప 2’ లో మెగాస్టార్ చిరంజీవి..ఏ క్యారెక్టరో తెలుసా..?

Pushpa 2 : ‘ఫుష్ప 2’ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప, పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్ నుంచి సినిమాగా మారిన ఈ కథ, ఆ తర్వాత రెండు భాగాలుగా తీయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. మొదటి భాగం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో భారీ వసూళ్ళను రాబట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుక్కూ.. ఈ సినిమా సీక్వెల్ కథను పక్కాగా రెడీ చేసి షూటింగ్ మొదలు పెట్టాడు.

తాజాగా పుష్ప సినిమాలోని పర్ఫార్మెన్స్ కి అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా జాతీయ పురష్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బన్నీని సతీ సమేతంగా అభినందించారు. అయితే, అల్లు అర్జున్ గతంలో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో మొదటిసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి అలరించారు. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా మారారు. సుకుమార్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘ఆర్య’ ఓ సెన్షేషనల్ హిట్. ఆ తర్వాత వీరి కాంబోలో ఆర్య 2, పుష్ప వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.

pushpa-2-is-megastar-chiranjeevi-going-to-play-a-role

అయితే, తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 సినిమాలో కీలకమైన పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. చిరు-బన్నీ కలిసి కనిపించే సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ నటుడు చేయాల్సిన పాత్రను చిరు కోరగానే సుక్కూ ఆ పాత్రను చేయించాలని డిసైడయ్యారట. ఇంతకముందు చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాలలో మెగా హీరోలు అలా కనిపించి సందడి చేశారు. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలోనూ చిరు ఓ పాటలో అలరించిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాలో చిరు, చరణ్ కలిసి నటించారు.

ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా మెగా అభిమానులు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 లో మెగాస్టార్ నటించబోతున్నారంటే ఖచ్చితంగా అటు మెగా అభిమానులకి, ఇటు అల్లు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అనుకోవచ్చు. ఇదే నిజమైతే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా అమెరికా లాంటి దేశాలలోనూ బాక్సాఫీస్ వద్ద రచ్చ మామూలుగా ఉండదు. మరి మేకర్స్ ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడిస్తారో చూడాలి. కాగా, ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీప్రసాద్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

1 day ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

2 days ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 days ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 days ago

Kalki 2898 AD Sequel: సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్!

Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…

1 week ago

Puranapanda Srinivas: తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది

Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…

2 weeks ago

This website uses cookies.