Chiranjeevi – Allu Arjun : చిరంజీవికి అల్లు అర్జున్‌తో పెద్ద గొడవే జరిగిందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చి షికార్లు కొట్టాయి. కానీ, అలాంటిదేమీ లేదనే క్లారిటీ తాజాగా వచ్చింది. చిరంజీవి తనయుడు పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ స్థాపించినప్పటి నుంచి మెగాస్టార్ బావ అల్లు అరవింద్ సంస్థ గీతా ఆర్ట్స్‌లో సినిమాలు చేయనే లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత 151, 152, 153..ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఒకటి కాకపోయినా ఆ తర్వాత సినిమా అయినా నాకోసం చేయరా అంటూ అల్లు అరవింద్ వెయిట్ చేస్తూ వచ్చారు.
కానీ, ఎందుకనో చిరు బావ నిర్మాణంలో సినిమా చేయలేకపోయారు. ఆహా లో కూడా అన్‌స్టాపబుల్ అనే సెలబ్రిటీ టాక్ షోని కూడా బాలయ్యతో చేయడం ఒక హాట్ టాపిక్ అయింది. దీనంతటికీ కారణం అల్లుకి చిరు డేట్స్ ఇవ్వకపోవడమే అనుకున్నారు. అందుకే అల్లు అరవింద్ తన ఫోకస్ మొత్తం కొడుకు అల్లు అర్జున్ మీద పెట్టారు. దాని ఫలితమే పుష్ప అనే పాన్ ఇండియా సినిమా. ఆ సినిమాతో బన్నీకి వచ్చిన విపరీతమైన క్రేజ్. ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది బన్నీకే. దాని తర్వాత చరణ్, తారక్‌లకి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ దక్కడం.
Chiranjeevi – Allu Arjun : సురేఖ బన్నీపై తనకున్న ప్రేమను ముద్దుపెట్టి మరీ తెలిపింది.
అయితే, పుష్ప సినిమాకి ఇప్పుడు ఏకంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డ్ ని దక్కించుకోవడమే. ఈ అవార్డ్ దక్కిన్నందుకు యావత్ సినీ ప్రేమికులు, అల్లు అర్జున్ అభిమానులు, చిత్ర పరిశ్రమలు బన్నీకి ప్రత్యేకంగా అభినందించారు. అయితే, అందరు అనుకున్నది మాత్రం చిరు బన్నీని అభినందిస్తారా లేదా..? అని. ఎందుకంటే ఇద్దరి మధ్య ఎంతో కాలంగా కోల్డ్ వార్ జరుగుతుందని ప్రచారం కావడమే. వాటన్నిటికీ చెక్ పెట్టారు మెగాస్టార్ దంపతులు. అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా చిరంజీవి, సురేఖ అభినందించి పొగడ్తలతో ముంచేశారు.
చిరంజీవి సతీమణి సురేఖ బన్నీపై తనకున్న ప్రేమను గాఢంగా హత్తుకొని ముద్దుపెట్టి మరీ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకాలం చిరుకి బన్నితో గొడవ జరిగిందనే సోది మాటలకి చెక్ పెడుతూ ఊహించని షాకిచ్చారు. ఇంతకాలం వచ్చిన వార్తలన్నీ గాలి మాటలని అటు మెగా అభిమానులు ఇటు అల్లు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ రెండు ఫ్యామిలీలు అల్లు అర్జున్ కి అవార్డ్ వచ్చిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు యావత్ ప్రపచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది పుష్ప 2 కోసమే.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.