PuriSethupathi: పూజా కార్యమాలతో ప్రారంభం..

PuriSethupathi: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొత్త చిత్రాన్ని ఘనంగా పూజా కార్యమాలతో ప్రారంభించారు. ఆల్రెడీ ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న విషయాన్ని పూరి బృందం ప్రకటించింది. విజయ్ సరసన మలయాళ భామ సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దునియా విజయ్, టబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మెల్లగా మెయిన్ కాస్టింగ్‌ని ఫైనల్ చేసుకున్న పూరి.. తాజాగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ పూరి వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు. పాన్ ఇండియా రేంజ్‌లో చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశను మిగిల్చాయి. దాంతో ఈసారి పూరి కి డేట్స్ ఇచ్చే హీరో ఎవరు..? అనే సందేహం అందరిలోను కలిగింది. టాలీవుడ్‌లోనే బాలకృష్ణ, గోపీచంద్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి క్రేజీ హీరోల పేర్లు వినిపించాయి. కానీ, వాళ్ళెవరూ పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదట.

purisethupathi-starting-with-the-puja-rituals

PuriSethupathi: విజయ్ సేతుపతి మీద ఫోకస్ చేశాడు పూరి

దాంతో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మీద ఫోకస్ చేశాడు. పూరి చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో నటించే ప్రధాన తారాగణమంతా ఫైనల్ అయింది. సంగీత దర్శకుడిగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఫిక్సయ్యాడు. పాన్ ఇండియా వైడ్‌గా రూపొందించనున్న పూరిసేతుపతి సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతుంది. ‘పూరి కనెక్ట్స్’ పతాకంపై పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.

అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌లోకి జెబి మోషన్ పిక్చర్స్ వారు కూడా జాయిన్ అవడం అందరిలో ఆసక్తిని కలిగించే విషయం. జెబి మోషన్ పిక్చర్స్‌పై.. జెబి నారాయణ రావు, కొండ్రొల్ల ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా చేరారు. ప్రస్తుతానికి బెగ్గర్ అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తోంది. ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు. చూడాలి మరి పూరి ఈ సినిమాతోనైనా సాలీడ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అని.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

6 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

6 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.