Shirish: గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. చరణ్ కనీసం కాల్ కూడా చేయలేదు

Shirish: 2025 సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా ఆశాభంగం కలిగించింది.

ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ శిరీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ గురించి స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “గేమ్ ఛేంజర్ విడుదలైనప్పుడు మా పరిస్థితి అంతే! జీవితం అయిపోయినట్లే అనిపించింది. ఏదైనా సహాయం చేస్తారా అని ఎవరినీ అడగలేము. హీరో అయినా, డైరెక్టర్ అయినా ఒక్కసారి ‘ఏమైంది?’ అని కూడా ప్రశ్నించలేదు” అంటూ శిరీష్ చేసిన కామెంట్స్‌కి పెద్ద స్పందన వస్తోంది.

అయితే, వారు ఎవరినీ నిందించడం లేదని శిరీష్ స్పష్టం చేశారు. “మేమే ఇష్టపడి సినిమా చేశాం. నష్టాలను మేమే భరించాం. గేమ్ ఛేంజర్ వల్ల చాలా పోయింది. కానీ అదే టైంలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా కొంత ఊరటనిచ్చింది. నాలుగు రోజుల వ్యవధిలో మా పరిస్థితి తిరిగి మారింది. ఆ సినిమా లేకపోతే ఏం అయేదో ఊహించలేం” అని చెప్పారు.

game-changer-flop-charan-didnt-even-call

Shirish: చరణ్ తో మనకు మంచి రిలేషన్ ఉంది.

ఇక రామ్ చరణ్‌తో రిలేషన్ పై మాట్లాడుతూ, “ఆయనతో మనకు మంచి రిలేషన్ ఉంది. మళ్లీ సినిమా చేయాలంటే చేయొచ్చు, చేయకపోయినా పరవాలేదు. అది పూర్తిగా ఆయన ఇష్టం” అని పేర్కొన్నారు. తమ బ్యానర్ (SVC) పారితోషికాల్ని వెనక్కి అడిగే స్థాయికి చేరలేదని, వచ్చిన లాభం తమదే, వచ్చిన నష్టం కూడా తమదే అనే ధోరణితో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఈ కామెంట్స్ చూసిన ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు శిరీష్ ఓపెనెస్‌కి మంచి స్పందన ఇస్తున్నారు. ఒక సినిమాతో పోయిన నష్టం నుంచి వెంటనే కోలుకోవడం, మరో సినిమాతో బౌన్స్ బ్యాక్ కావడం మూవీ బిజినెస్ లో సాధారణమే అయినా, ఈ స్థాయిలో ఓ ప్రొడ్యూసర్ అంత లోతుగా మాట్లాడటం అరుదైన విషయం.

మొత్తానికి, ‘గేమ్ ఛేంజర్’ అట్టర్ ఫ్లాప్ అయినా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తిరిగి నిలబడిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రస్తుతం ఇంకొన్ని ప్రాజెక్టులపై దృష్టిసారించింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.