Categories: DevotionalLatestNews

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విశాల ఆలయప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా మహా వైభవంగా జరుగుతున్న ఆరవ బ్రహ్మోత్సవాల తుది మంగళఘట్టమైన చక్రస్నానం వేద ఘోషలమధ్య అత్యద్భుతంగా సాగింది.

గత తొమ్మిదిరోజులుగా వివిధ వాహనాలతో మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా సాగడం.. వెనుకనే భక్త జనసంద్రం పోటెత్తడం భాగ్యనగర చరిత్రలో ఊహాతీత భక్తిఘట్టంగా చెప్పక తప్పదు.

జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర ఆదేశం మేరకు, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజ గోపాల నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో.. హైదరాబాద్ టీటీడీ ఏఈఓ రమేష్, హైదరాబాద్ జూబిలీహిల్స్ టీటీడీ టెంపుల్ ఇంచార్జి నిరంజన్ ఈ ఉత్సవాలను నిర్వహించన తీరు జంటనగరాల చరిత్రలో హైలైట్‌గా నిలిచింది.

Puranapanda Srinivas Sreemaalika Book Highlight in Hyderabad TTD Celebrations

Puranapanda Srinivas: బ్రహ్మోత్సవాల్లో శ్రీమాలిక పరమాద్భుత గ్రంధాన్ని

ఈసారి మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, బీఎస్‌సిపీఎల్ ఇన్ఫ్రా గ్రూప్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పించిన శ్రీ మాలిక నాలుగు వందల పేజీల గ్రంధం వందలకొలది భక్తులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ ఉత్సవాల శోభతో హైలైట్‌గా నిలవడం విశేషం. ఉత్సవాల ప్రారంభానికి ముందే బొల్లినేని కృష్ణయ్య ఈ మహా గ్రంధం శ్రీమాలిక వేల ప్రతులను టెంపుల్ ఇంచార్జి‌కి అర్చకుల సమక్షంలో అందివ్వడంతో.. ఏఈవో రమేష్ పర్యవేక్షణలో ఈ చక్కని గ్రంధాన్ని ఉత్సవ నిర్వహణలో ఉపకరించిన దాతలకు, పారిశ్రామిక వేత్తలకు, వీఐపీ దర్శనాల్లో పాల్గొన్న మంత్రులకు, ప్రముఖులకు టెంపుల్ ఇంచార్జి నిరంజన్ ప్రసాదంతో పాటు ఆశీర్వచన మంటపంలో అందివ్వడం ఈసారి బ్రహ్మోత్సవాల్లో వైభవంగానే చెప్పాలని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Puranapanda Srinivas Sreemaalika Book Highlight in Hyderabad TTD Celebrations

మరీ ముఖ్యంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో శ్రీమాలిక పరమాద్భుత గ్రంధాన్ని శోభాయమాన శ్రీ నరసింహస్వామి అందాలతో పవిత్రీకరించి.. మొత్తం బ్రహ్మోత్సవాలకే తలమానికంగా నిలిచేలా అందించి ఎంతోమంది ప్రశంసలు పొందిన శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఉదయ సాయంకాల వేళల్లో పాల్గొని తన్మయించడం అక్కడి వందల కొలది భక్తులను ఎంతో ఆకర్షించింది. శ్రీనివాస్‌తో ఎంతోమంది భక్తులు సెల్ఫీలు దిగడం మీడియా కంటపడింది. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ మహద్భాగ్యమని పురాణపండ శ్రీనివాస్ ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలపడం అభినందనీయం.

Puranapanda Srinivas Sreemaalika Book Highlight in Hyderabad TTD Celebrations

జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ చైర్మన్ ఏ.వి రెడ్డి ప్రతీరోజు మాడవీధుల ఉభయ సంధ్యలులో వాహన సేవల ఉత్సవాలను పర్యవేక్షించారు. తిరుమల నుండి వచ్చిన వేద పండితులు వైఖానస ఆగమోక్తంగా వైదిక విధులను నిర్వర్తించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చక్రస్నానంలో పాల్గొన్నారు. ఈ చక్రస్నాన మహోత్సవం తిరుమల ఉత్సవాన్ని తలపించిందని వేల వేల భక్తులు సంతోషంతో పొంగిపోవడం సత్యమేకదా అని ఆలయ అర్చకులు శృతికలిపారు.

సాయంకాలం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ప్రసన్న గంభీర ధ్వనుల వేద ఘోషల మధ్య ధ్వజ అవరోహణ కార్యక్రమం జరిగింది. వందల కొలది భక్తుల గోవిందనామాల మధ్య హైదరాబాద్ టీటీడీ ఆలయాల ఏ ఈ ఓ రమేష్, ఇంచార్జీ నిరంజన్, టీటీడీ జూబిలీహిల్స్ చైర్మన్ ఏ. వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

21 hours ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

3 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

3 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

6 days ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

6 days ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

6 days ago

This website uses cookies.