Kalki 2898 AD Sequel: సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్!

Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఒకటి కల్కి సీక్వెల్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD 2024లో వచ్చి ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెల్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే, తాజా సమాచారం మేరకు కల్కి మూవీ సీక్వెల్ మొదలైనట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ మూవీలో నటించే చైల్డ్ ఆర్టిస్టుల కోసం కూడా ఆడిషన్స్ నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తే కల్కి మూవీ సీక్వెల్ షూట్ మొదలైనట్టుగా కన్‌ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక, మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్, దీపిక పడుకోణ్, కమల్ హాసన్, దిశా పఠాని, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాంగోపాల్ వర్మ నటించారు.

kalki-2898-ad-sequel-shooting-update

Kalki 2898 AD Sequel: కల్కి సీక్వెల్ మూవీ షూటింగ్ కోసం శంకర్ పల్లిలో భారీ సెట్స్‌

కానీ, సీక్వెల్ మూవీలో మాత్రం దీపిక పడుకోణ్ నటించడం లేదు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పిరిట్ మూవీలో దీపిక నటించాల్సి ఉండగా..సందీప్‌తో ఆమెకి వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తప్పించారు. ఆ ఎఫెక్ట్ కల్కి సీక్వెల్ మీద కూడా పడింది. అఫీషియల్‌గా ఇందులో నుంచి కూడా తప్పించారు. దీపిక స్థానంలో సాయి పల్లవి నటించనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా, కల్కి సీక్వెల్ మూవీ షూటింగ్ కోసం శంకర్ పల్లిలో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లపై సీన్స్‌ని దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరిస్తున్నాడట. మరి, కల్కి సీక్వెల్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా అధికారికంగా మేకర్స్ వెల్లడించలేదు. కాగా, ప్రభాస్ సలార్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కీ 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్..ఇలా అన్నీ భారీ పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.