Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొంతకాలంగా ఎక్కువగా అనవసరమైన వివాదాలలో ఇరుక్కుంటుంది. చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. వారు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఇండస్ట్రీ పరువుని మొత్తం తీసేశారు. సోషల్ మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కంగనా రనౌత్, వివేక్ అగ్నిహోత్రి లాంటి యాక్టర్స్ ఒక వర్గంగా ఉంటే కరణ్ జోహార్ అలాగే నెపో కిడ్స్ అందరూ ఒక వర్గంగా ఉన్నారు. నెపోటిజం కారణంగా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ అవకాశాలు కోల్పోతున్నారని, మానసికంగా కృంగిపోతున్నవారు ఉన్నారని కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలు రెగ్యులర్ గా సంచలనంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆమె కరణ్ జోహార్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుంది.
చాలా మంది సెలబ్రిటీ వారసత్వంతో హీరోయిన్స్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు. అసలు యాక్టింగ్ రాకపోయిన కూడా కొంతమందికి అవకాశాలు వస్తున్నాయని కంగనా ఆరోపణ. తమలాంటి వారిని పూర్తిగా పక్కన పెట్టి రికమండేషన్ తోనే హీరోయిన్స్ సెలక్షన్స్ జరుగుతున్నాయని ఆమె ముఖ్యంగా కరణ్ జోహార్ మీద విమర్శలు చేస్తూ ఉంటుంది.. ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రియాంకా చోప్రా బాలీవుడ్ ని వదిలేయడానికి కారణం చెప్పింది. బాలీవుడ్ లో రాజకీయాలు భరించలేకనే ఇండస్ట్రీని వదిలేసా అని చెప్పింది. తనని అనేక రకాలుగా వేధింపులకి గురిచేశారని ఆమె ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొంది.
తనని తొక్కేయాలని చూసారని కూడా వ్యాఖ్యానించింది. ఇక ఈ వ్యాఖ్యలకి కంగనా రనౌత్ మద్దతు నిలవడంతో మరోసారి కరణ్ జోహార్ మీద ఫైర్ అయ్యింది. ప్రియాంకా చోప్రా మీద కరణ్ జోహార్ బ్యాన్ వేసారని గుర్తుచేసింది. ప్రియాంకా చోప్రా షారుఖ్ ఖాన్ ని దగ్గర కావడం కరణ్ తట్టుకోలేకపోయాడని పేర్కొంది. ఈ నేపధ్యంలోనే ఆమెని వేధింపులకి గురి చేశారని కంగనా విమర్శలు చేసింది. ఇక ది కాశ్మీర్ ఫైల్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ప్రియాంకా చోప్రా వ్యాఖ్యలకి మద్దతు ఇచ్చారు. ఆమె చెప్పింది అక్షర సత్యం అని పేర్కొంది. బాలీవుడ్ లో ఉన్న రాజకీయాల కారణంగా ఎంతో మంది అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.