Thu. Nov 13th, 2025

    April 1: మారుతున్న కాలంతో పాటు ప్రజల అవసరాలు, ఉత్పత్తుల వినియోగం కూడా మారుతున్నాయి. కొన్నింటిపై అత్యధికంగా ఆధారపడుతున్నారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు సేవింగ్స్ పైన దృష్టి పెడుతున్నారు. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే పెరుగుతున్న ఆదాయానికి తగ్గట్లు ఇన్కమ్ ట్యాక్ కట్టడం భాగం అయిపొయింది. అయితే ఇన్కమ్ టాక్స్ స్లాబ్ సిస్టమ్ ని కేంద్రం ప్రభుత్వం మార్చింది. కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ తో, వస్తు వినియోగ రంగంలో దేశీయ ఉత్పత్తులని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో దేశీయ ఉత్పత్తుల ధరలని తగ్గించే ప్రయత్నం చేసింది.

    Gold prices today, 2 March: Check rates in Indian cities

    అదే సమయంలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అదనపు సుంకం వేయడం వలన ధరల పెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణల కారణంగా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు కొన్ని సామాన్యులకు ఊరట కలిగిస్తే మరికొన్ని భారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ తో చాలా నిర్ణయాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక కొత్త పన్ను విధానం కూడా ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే ధరల్లో కూడా కొన్ని ఉత్పత్తులు పెరుగుతాయి మరికొన్ని తగ్గుతాయి.

    Hero MotoCorp Vida V1 electric scooter launched - Motoring World

    చూసుకుంటే దేశంగా తయారీ ని ప్రోత్సహించడం లక్ష్యంగా వస్తు ధరల మార్పులు తీసుకొచ్చారు. ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రికల్స్ వస్తువులు, ప్లాస్టిక్, బంగారం, వెండి, ప్లాటినం, ఇమిటేషన్ జ్యువలరీ, సిగరెట్లకి సంబంధించిన ధరలు పెరుగుతాయి. అలాగే దుస్తులు, వజ్రాలు, రంగురాళ్లు, బొమ్మలు, కాఫీ గింజలు, మొబైల్ ఫోన్లు, కెమెరా లెన్స్, భారత్లో తయారయ్యే ఎలక్ట్రానిక్ వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులలో కొన్ని రకాల రసాయనాలు, లిథియం బ్యాటరీలు ధరలు తగ్గునున్నాయి. మొత్తానికి వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే బంగారు ఆభరణాలు ధరలు ఏప్రిల్ నుంచి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.